Gold and Silver rate today : మగువలకు షాక్ ఇస్తున్న పసిడి.. మరోసారి పెరిగిన ధరలు
పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది.. బంగారం ధర భారీగాపెరిగింది. మంగళవారం బులియన్ ట్రేడింగ్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.297..
Gold and Silver rate today : పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది.. బంగారం ధర భారీగాపెరిగింది. మంగళవారం బులియన్ ట్రేడింగ్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.297 పెరిగి రూ.48,946కు చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. కిలో వెండిపై రూ.1,404 పెరగడం ద్వారా రూ.65,380కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు 1858 డాలర్లుగా ఉంది. అదే సమయంలో వెండి 25.39 డాలర్లుగా నమోదైంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.
హైద్రాబాద్ లో 10 గ్రాముల బంగారం( 22 క్యారెట్స్ )ధర రూ46,200 గా ఉంది. 24 క్యారెట్స్ రూ 50,400. చెన్నైలో 10 గ్రాముల బంగారం( 22 క్యారెట్స్ )ధర రూ46,800, 24 క్యారెట్స్ రూ 51,050. ఢిల్లీ లో 10 గ్రాముల బంగారం( 22 క్యారెట్స్ )ధర రూ48,350 గా ఉంది. 24 క్యారెట్స్ రూ 52,750 గా ఉంది. ఇక విజయవాడ, వైజాగ్ లో 10 గ్రాముల బంగారం( 22 క్యారెట్స్ )ధర రూ46,200 గా ఉంది. 24 క్యారెట్స్ రూ 50,400
ఇక వెండి విషయానికొస్తే
హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ 704గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ 704 ,ఢిల్లీ లో 10 గ్రాముల వెండి ధర రూ 658, ఇక విజయవాడ, వైజాగ్ లో 10 గ్రాముల వెండి ధర రూ 704 గా ఉంది.