హత్రాస్ బాధితురాలి సీసీటీవీ ఫుటేజీ మాయం !
హత్రాస్ కేసులో కొన్ని కీలక సాక్ష్యాధారాలను దొరక్కుండా మాయం చేస్తున్నారు. ఆమెను గత నెల 14 న ఆసుపత్రికి తరలించిన సీసీటీవీ ఫుటేజీ కనిపించడంలేదట.. జిల్లా అధికారులు గానీ, పోలీసులు గానీ ఆ సమయంలో...
హత్రాస్ కేసులో కొన్ని కీలక సాక్ష్యాధారాలను దొరక్కుండా మాయం చేస్తున్నారు. ఆమెను గత నెల 14 న ఆసుపత్రికి తరలించిన సీసీటీవీ ఫుటేజీ కనిపించడంలేదట.. జిల్లా అధికారులు గానీ, పోలీసులు గానీ ఆ సమయంలో ఈ ఫుటేజీని కోరలేదని, ఇప్పుడు నెల రోజుల తరువాత తాము దాన్ని ప్రొవైడ్ చేయలేమని సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్ వీర్ సింగ్ చేతులెత్తేశారు. ఎవరైనా అడిగి ఉంటే దాన్ని భద్రపరిచి ఉండేవారమన్నారు. ప్రతి ఫుటేజీని ప్రతి ఏడు రోజులకొకసా రి డిలీట్ చేస్తుంటామని ఆయన చెప్పారు. అసలు తొలి రోజు ఫుటేజీయే చాలా కీలకమని భావిస్తున్న సీబీఐ అధికారులు..ఈయన చెప్పినదాన్ని విని హతాశులయ్యారు.