సోనుసూద్‌కు అరుదైన అవకాశం.. దానికి గుర్తింపుగానే!

నటుడు సోనుసూద్‌కు అత్యంత అరుదైన అవకాశం దక్కింది. ఆయనతోపాటు ఓ బాలీవుడ్ నటి కూడా ఈ అరుదైన అవకాశంలో భాగస్వామి కాబోతున్నారు.

సోనుసూద్‌కు అరుదైన అవకాశం.. దానికి గుర్తింపుగానే!
Follow us
Rajesh Sharma

|

Updated on: Oct 15, 2020 | 2:47 PM

Rare chance to Actor Sonusood: సోనూసూద్.. ఈ పేరు కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ దాకా చాలా మందికి తెలియదు. కానీ లాక్ డౌన్ సమయంలో తాను చేసిన ప్రజా సేవ కారణంగా ముఖ్యంగా వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు సోనూసూద్ తీసుకున్న చొరవ కారణంగా ఇపుడు దేశంలో ఆయన పేరు తెలియని వారు లేరూ అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఈ సినీ నటునికి అరుదైన అవకాశం దక్కింది.

కరోనా వైరస్ వ్యాప్తించిన పాండెమిక్ పీరియడ్‌లో.. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో అత్యంత అసాధారణ సేవా కార్యక్రమాలను నిర్వహించిన వారిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు డిస్కవరీ ఛానల్ రూపొందిస్తున్న సిరీస్‌ను సోనూ సూద్ హోస్ట్ చేయబోతున్నారు. భారత్‌కే మహావీర్ పేరిట మూడు భాగాలుగా తెరకెక్కబోతున్న అన్ సంగ్ హీరోస్ ఆధారిత షోను సోను సూద్ ప్రజెంట్ చేయబోతున్నారు. బాలీవుడ్ నటి దియా మిర్జా కో-హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ఈ షోను డిస్కవరీ ఛానల్‌తో కలిసి యునైటెడ్ నేషన్స్ (ఇండియా), నీతి ఆయోగ్ కలిసి సంయుక్తంగా నిర్మించ తలపెట్టాయి.

కరోనా పాండమిక్ పరిస్థితిలో అసాధారణ సేవా కార్యక్రమాలు నిర్వహించిన 12 మందిని ఇప్పటికే గుర్తించారు. వీరు చేసిన కార్యక్రమాలను భారత్‌కే మహావీర్ ధారావాహికలో సోను సూద్ దేశానికి పరిచయం చేయబోతున్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్.. పాండమిక్ పరిస్థితిలో తమ విధులకే పరిమితం కాకుండా సేవ దృక్పథంతో పని చేసిన పలువురిని తాము గుర్తించినట్లు తెలిపారు.

Also read: కరోనా వాక్సిన్… క్లినికల్ ట్రయల్స్‌లో కీలక మార్పు

Also read: సముద్రంలో బోటు గల్లంతు