ట్రాక్టర్ తిరగబడి కొడుకు మరణం, బాధ తట్టుకోలేక ఆగిన తల్లి గుండె
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నకొడుకు ప్రమాదవశాత్తూ చనిపోయి విగతజీవిగా ఉండటం చూసి తల్లి గుండె తట్టుకోలేక పోయింది.

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నకొడుకు ప్రమాదవశాత్తూ చనిపోయి విగతజీవిగా ఉండటం చూసి తల్లి గుండె తట్టుకోలేక పోయింది. కుమారుడు మృతిచెందిన కొద్దిసేపటికే గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. ఒకే రోజు తల్లి, తనయుడు.. ఇద్దరూ చనిపోవడంతో అద్దంకి మండల పరిధిలోని తిమ్మాయపాలెంలో బుధవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ( తెలంగాణ : ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం )
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తోకల వెంకటేశ్వర్లు, రాగమ్మ(60)కు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు సుబ్బారావు(30) బుధవారం తన మిత్రుడి ట్రాక్టర్ పొలంలో దమ్ము చేస్తూ దిగబడటంతో, దానిని బయటకు తీసేందుకు మరో ట్రాక్టర్‌తో ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ తిరగబడి స్పాట్‌లోనే మృతిచెందాడు. స్థానికులు పొలం నుంచి సుబ్బారావు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. సుబ్బారావు మృతదేహాన్ని చూసిన తల్లి రాగమ్మ.. కుమారుడు లేడన్న బాధను తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందింది. సుబ్బారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకే ఇంటిలో తల్లి, కుమారుడు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ( దింపుడుకల్లం వద్ద పిలుపుకు స్పందన, ఆస్పత్రికి తీసుకెళ్తే.. )