Delhi: కవితను కోర్టుకు హాజరుపరిచిన సీబీఐ.. కోర్టు కీలక ఆదేశాలు..

ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచింది సీబీఐ. ఆమెను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలని ఢిల్లీ స్పెషల్ కోర్టును సీబీఐ కోరింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఆరోపిస్తోంది సీబీఐ. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం.. ఇవన్నీ కవిత కనుసన్నల్లోనే జరిగాయంటోంది.

Delhi: కవితను కోర్టుకు హాజరుపరిచిన సీబీఐ.. కోర్టు కీలక ఆదేశాలు..
Kavita
Follow us
Srikar T

|

Updated on: Apr 15, 2024 | 10:41 AM

ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచింది సీబీఐ. ఆమెను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలని ఢిల్లీ స్పెషల్ కోర్టును సీబీఐ కోరింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఆరోపిస్తోంది సీబీఐ. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం.. ఇవన్నీ కవిత కనుసన్నల్లోనే జరిగాయంటోంది. మూడ్రోజుల కస్టడీలో అనేక కోణాల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు ఇవాళ్టితో కవిత కస్టడీ ముగుస్తుండడంతో కోర్టులో హాజరుపరించారు. కవితను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలని సీబీఐ కోరగా.. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది కోర్టు.

మరోవైపు కోర్టుకు హాజరవ్వుతున్న సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు కవిత స్పందించారు. ఇది బీజేపీ కస్టడీ.. సీబీఐ కస్టడీ కాదంటూ ఆరోపించారు. బీజేపీ నేతలు మాట్లాడిన మాటలే సీబీఐ అడుగుతోందని.. గత రెండేళ్లుగా అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారన్నారని కవిత తెలిపారు. అయితే కవిత వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 16న కోర్టులో విచారణకు రానుంది. ఈ క్రమంలో రేపు కూడా కవిత కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఢిల్లీ కోర్టు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన తరుణంలో రేపు బెయిల్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వెలువడుతుందో అన్న ఉత్కంఠ తెరమీదకు వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..