Chennai Floods: చెన్నైలోని వరద బాధితులకు అమ్మ క్యాంటీన్ల నుంచి ఉచితంగా ఆహారాన్ని అందించనున్న ప్రభుత్వం..

Chennai Floods: భారీ వర్షాలతో వరదలతో అతలాకుతలమైన చెన్నైలోని ప్రజలకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం..

Chennai Floods: చెన్నైలోని వరద బాధితులకు అమ్మ క్యాంటీన్ల నుంచి ఉచితంగా ఆహారాన్ని అందించనున్న ప్రభుత్వం..
Tamilandufree Food
Follow us
Surya Kala

|

Updated on: Nov 09, 2021 | 8:59 PM

Chennai Floods: భారీ వర్షాలతో వరదలతో అతలాకుతలమైన చెన్నైలోని ప్రజలకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందించనున్నామని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. చెన్నైలో వర్షాలు కురవడం ఆగే వరకు ఉచిత ఆహారం కార్యక్రమం కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ కాన్సెప్ట్‌ను దివంగత  నేత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. పేద ప్రజలకు ఆహారాన్ని సబ్సిడీగా అందించేందుకు అమ్మ క్యాంటీన్ల కార్యక్రమంగా ప్రారంభించారు. అది మంచి హిట్ అయింది. తక్కువ ధరకు మంచి నాణ్యమైన ఆహారాన్ని అందింస్తూ ఉత్తమమైన పథకంలో ఒకటిగా ఖ్యాతిగాంచింది. ఇక అమ్మ అనే మాటను జయలలిత కోసం ఆమె మద్దతుదారులు ఉపయోగిస్తారు.

మునిసిపల్ ఏజెన్సీ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కూడా నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో రోజుకు మూడు సార్లు ఆహారాన్ని అందజేస్తుంది.  మరోవైపు అమ్మ క్యాంటీన్ పథకంలో ఇడ్లీ, పొంగల్, సాంబార్, పెరుగు అన్నం, లెమన్ రైస్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని విక్రయిస్తుంది.

చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. చెంగల్‌పేట, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని చెన్నై, శివారు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి అడపాదడపా వర్షం కురుస్తోంది.  2015 వరదల తర్వాత ఇప్పుడు కురిసిన వర్షం అత్యంత భారీ వర్షపాతంగా నమోదైంది. నగరంలోని వరదనీటిని తొలగించేందుకు చెన్నై కార్పొరేషన్ 570 విద్యుత్ పంపులను ఏర్పాటు చేసింది. అక్టోబర్‌లో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి తమిళనాడు, పుదుచ్చేరిలో 46 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

Also Read:   కుక్క అనుకుని పెంచుకుంటే.. 6 నెలల తర్వాత అసలు విషయం తెలిసి షాక్..