Cable Bridge Collapse: కన్నీటిని మిగిల్చిన కేబుల్‌ బ్రిడ్జి.. ఈ వంతెనను ఎప్పుడు కట్టారు?

కేబుల్‌ బ్రిడ్జి కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య పెరిగిపోయింది. మృతుల్లో చాలా మంది చిన్నారులు సైతం ఉన్నారు. ఎంతో మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు..

Cable Bridge Collapse: కన్నీటిని మిగిల్చిన కేబుల్‌ బ్రిడ్జి.. ఈ వంతెనను ఎప్పుడు కట్టారు?
Cable Bridge Collapse
Follow us
Subhash Goud

|

Updated on: Oct 31, 2022 | 5:56 AM

గుజరాత్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోర్చిలో ఆదివారం కేబుల్‌ బ్రిడ్జి కూలిపోయి మొదట మృతుల సంఖ్య 60 మంది వరకు ఉండగా, తర్వాత 90 మందికిపైగా చేరింది. కేబుల్‌ బ్రిడ్జిపై మొత్తం 500 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కాపాడాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మచ్చు నదిపై కొత్తగా నిర్మించిన ఈ కేబుల్ వంతెనను మూడు రోజుల క్రితం ప్రారంభించారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కేబుల్‌ బ్రిడ్జి చరిత్ర ఏమిటి..?

ప్రమాదానికి గురైన కేబుల్‌ బ్రిడ్జి చాలా పురాతనమైనది. వందేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి. ఈ వంతెనను143 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్ రిచ్చర్డ్ టెంపుల్ ప్రారంభించారు. అనాడు ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3.5 లక్షల ఖర్చు చేయగా, బ్రిడ్జికి అవసరమైన సామాగ్రి మొత్తం ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించారు.

దర్బార్‌ గఢ్-నాజర్ బాగ్‌ను కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి పొడవు 765 అడుగులు. దీనికి అధికారులు మూడు రోజుల కిందటే మరమ్మతులు చేపట్టారు. గత రెండేళ్లుగా ఈ కేబుల్ వంతెన మూసివేయగా, గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా అక్టోబర్ 26న మరమ్మతులు చేపట్టి తిరిగి ఓపెన్‌ చేశారు. అయితే, ఇప్పుడు ఈ హ్యాంగింగ్ పూల్ మహాప్రభుజీ సీటు, సమకంఠ ప్రాంతం మొత్తాన్ని కలుపుతుంది. ఈ కేబుల్ వంతెన గుజరాత్‌లోని మోర్బీకే కాకుండా యావత్ దేశానికి చారిత్రక వారసత్వం.

ఇవి కూడా చదవండి

ఈ కేబుల్‌ వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో చాలా మంది నీటిలో పడిపోగా, కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. విషయంలో తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇతర సహాయక సిబ్బందిని రంగంలోకి దించి చర్యలు వేగవంతం చేశారు. ప్రమాద ఘటనపై గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి స్పందించారు. ఇప్పటి వరకు చాలా మందిని కాపాడామని, గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దింపింది గుజరాత్‌ ప్రభుత్వం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!