AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallonji Mistry: వ్యాపార దిగ్గజం, పద్మభూషణ్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత.. పులువురు ప్రముఖుల సంతాపం..

156 ఏళ్ల క్రితం ముంబైలో షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ను స్థాపించగా.. దీని విజయానికి పల్లోంజీ మిస్త్రీ బాటలు వేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ (2022 జూన్ 28వ తేదీ నాటికి) ప్రకారం.. పల్లోంజీ దేశంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.

Pallonji Mistry: వ్యాపార దిగ్గజం, పద్మభూషణ్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత.. పులువురు ప్రముఖుల సంతాపం..
Pallonji Mistry
Shaik Madar Saheb
|

Updated on: Jun 28, 2022 | 11:13 AM

Share

Pallonji mistry passed away: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పల్లోంజీ మిస్త్రీ సోమవారం రాత్రి కన్నుమూశారు. 93 ఏళ్ల దిగ్గజ పారిశ్రామికవేత్త మిస్త్రీ ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 150 ఏళ్లకు కిందట ఏర్పడిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ దేశంలోని అతిపెద్ద వ్యాపార దిగ్గజాలలో ఒకటిగా ఎదిగింది. గుజరాత్‌లోని పార్సీ కుటుంబంలో పల్లోంజీ జన్మించారు. 156 ఏళ్ల క్రితం ముంబైలో షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ను స్థాపించగా.. దీని విజయానికి పల్లోంజీ మిస్త్రీ బాటలు వేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ (2022 జూన్ 28వ తేదీ నాటికి) ప్రకారం.. పల్లోంజీ దేశంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. పల్లోంజీ మిస్త్రీ నికర ఆస్తుల విలువ 28.90 బిలియన్ డాలర్లు. షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్18 ప్రధాన కంపెనీలతో కూడిన ప్రపంచ వ్యాపార సంస్థగా విస్తరించింది. కాగా పల్లోంజీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

పారిశ్రామికవేత్తగా చేసిన కృషికి పల్లోంజీ మిస్త్రీ 2016లో దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను అందుకున్నారు. పల్లోంజీ మిస్త్రీ పెద్ద కుమారుడు షాపూర్జీ మిస్త్రీ షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు సైరస్ మిస్త్రీ 2012 – 2016 మధ్య టాటా సన్స్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇంకా ఇద్దరు కుమార్తెలు – లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ ఉన్నారు.

1865లో స్థాపించిన ఈ పల్లోంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ.. ఇంజనీరింగ్ నిర్మాణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో వ్యాపారం సాగిస్తోంది. ఆఫ్రికా, భారత్‌, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ భవనం, హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ భవనాలు కూడా షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..