Bus Stop Stolen: ఇందేదయ్యా ఇదీ.. రాత్రికి రాత్రే ఏకంగా బస్టాప్‌నే ఎత్తుకెళ్లారు! ఇదేం పైత్యం అంటూ నెట్టింట సెటైర్లు..
బస్టాపుల్లో జేబు దొంగలు, చైన్ స్నాచర్లను చూశాం. పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగల ముఠాలు కూడా కాపాకాచి ఉంటాయి. కానీ వీడెవడో ఏకంగా బస్‌స్టాప్‌కే ఎసరు పెట్టాడు. అసక్కడ బస్టాప్ ఉండేదా ? అనే సందేహం కలిగేలా కనీసం అనవాళ్లు కూడా లేకుండా సాంతం ఎత్తుకెళ్లాడు. ఈ విచిత్ర ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్డు వాహనాల రాకపోకలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అక్కడ బెంగళూరు
బెంగళూరు, అక్టోబర్ 5: బస్టాపుల్లో జేబు దొంగలు, చైన్ స్నాచర్లను చూశాం. పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగల ముఠాలు కూడా కాపాకాచి ఉంటాయి. కానీ వీడెవడో ఏకంగా బస్‌స్టాప్‌కే ఎసరు పెట్టాడు. అసక్కడ బస్టాప్ ఉండేదా ? అనే సందేహం కలిగేలా కనీసం అనవాళ్లు కూడా లేకుండా సాంతం ఎత్తుకెళ్లాడు. ఈ విచిత్ర ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్డు వాహనాల రాకపోకలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అక్కడ బెంగళూరు మెట్రోపోలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BNTC) కొత్తగా బస్టాప్‌న్‌ను నిర్మించింది. దాదాపు రూ.10 లక్షల విలువైన సామాగ్రితో స్టెయిన్‌లెస్-స్టీల్‌తో అధునాతన వసతులతో దీనిని నిర్మించింది. అయితే బస్‌షెల్టర్ నిర్మించిన వారం రోజుల్లోనే ఓ దొంగ దానిని మాయం చేశాడు. అదును చూసి ఎవరూ లేని సమయంలో చోరీ చేసి బస్‌ప్టాప్‌ను విడిభాగాలుగా విడగొట్టి ఎత్తుకెళ్లారు. బస్టాప్‌ను నిర్మించిన కంపెనీ ప్రతినిధి ఎన్ రవి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాఫీ డేకి దగ్గరలో తాము బస్టాప్ నిర్మించామని, ఆగస్టు 21న దాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆగస్టు 28వ తేదీన ఉదయం నాటికి అది మాయమైపోయిందని మీడియాకు చెప్పారు. దీనిపై రవి రెడ్డి సెప్టెంబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదే మాదిరి ఈ ఏడాది మార్చిలో HRBR లేఅవుట్ వద్ద నిర్మించిన 30 ఏళ్ల నాటి పాత బస్టాడ్ ఒకటి రాత్రికి రాత్రే కేటుగాళ్లు మాయం చేశారు. 1990లో సదరు బస్‌స్టాండ్‌ను లయన్ క్లబ్ కళ్యాణ్ నగర్‌లో నిర్మించి విరాళంగా ఇచ్చింది. తాజా ఘటనలో బస్టాప్‌నును ఉద్దేశపూర్వకంగానే తొలగించారా అని బీబీఎంపీ అధికారులను అడిగామని, తామేం తీయలేదని వారు చెప్పారని రవి రెడ్డి వివరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బస్టాపులను ఎత్తుకెళ్లిన ఘటనలు బెంగళూరులో మాత్రమే కాకుండా గతంలోనూ పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. 2015లో హారిజన్ స్కూల్ సమీపంలోని దూపనహళ్లి బస్టాప్ రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది. గతంలో 2014లో రాజరాజేశ్వరినగర్‌లోని బీఈఎంఎల్ లేఅవుట్ 3వ స్టేజీలో 20 ఏళ్ల నాటి బస్టాప్ కనిపించకుండా పోయింది.
మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి.