AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robbery Attempt: బస్సు డ్రైవర్‌పై దోపిడీ దొంగల కాల్పులు.. బుల్లెట్లు తగిలినా ఆపకుండా 30 కిలోమీటర్లు డ్రైవింగ్‌!

మహారాష్ట్రకు చెందిన ఓ మినీ బస్సుపై సోమవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బుల్లెట్లు తగిలినా బస్సులో ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు బస్సును ఆపకుండా 30 కిలోమీటర్లు నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా బస్సు నడిపాడు. ప్రయణికులందరినీ సురక్షితంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాడు..

Robbery Attempt: బస్సు డ్రైవర్‌పై దోపిడీ దొంగల కాల్పులు.. బుల్లెట్లు తగిలినా ఆపకుండా 30 కిలోమీటర్లు డ్రైవింగ్‌!
Robbery Attempt
Srilakshmi C
|

Updated on: Mar 12, 2024 | 7:38 PM

Share

మహారాష్ట్ర, మార్చి 12: మహారాష్ట్రకు చెందిన ఓ మినీ బస్సుపై సోమవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బుల్లెట్లు తగిలినా బస్సులో ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు బస్సును ఆపకుండా 30 కిలోమీటర్లు నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా బస్సు నడిపాడు. ప్రయణికులందరినీ సురక్షితంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. బస్సులో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా అమరావతి నుంచి నాగ్‌పుర్‌లో ఆలయం దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా నంద్‌గావ్ పేత్ సమీపంలోని హైవే 6పై ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ ఖోమ్‌దేవ్ కవాడే తెలిపిన వివరాల ప్రకారం..

అమరాతిలోని ఆలయాన్ని దర్శించుకొని ప్రయాణికులతో నాగ్‌పుర్‌కు తిరుగు ప్రయాణమైనప్పటి నుంచి బొలెరో కారు బస్సును వెంబడించింది. వారికి వెళ్లడానికి రెండుసార్లు దారి ఇచ్చినా ముందుకువెళ్లకుండా వెనకే రాసాగారు. వాహనం నంబర్‌ సరిగ్గా గుర్తు లేదు. కాని అది ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ గల బొలెరో ఎస్‌యూవీ కారు. కొంతసేపటికి బస్సు ముందుకువచ్చిన దుండగులు కారులో నుంచే తనపై కాల్పులు జరిపి, బస్సును ఆపేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. మొదటిసారి తప్పించుకోగలిగినా, రెండోసారి మాత్రం తన చేతిపై బెల్లెట్‌ తలిగింది. చేతికి గాయం అయినా మినీ బస్సును మాత్రం ఆపలేదు.

నొప్పిని భరిస్తూనే అందులోని ప్రయాణికులను వారినుంచి కాపాడాలని దాదాపు 30 కిలోమీటర్లు బస్సును నడిపి పోలీస్‌స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లానని డ్రైవర్‌ తెలపాడు. డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు ప్రయాణికులు కూడా గాయపడ్డారు. వారిని తివ్సాలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ చూపిన తెగువకు ప్రయాణికులు అతడిని ప్రశంసించారు. అతని వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.