Manipur: తన భార్య క్యాన్సర్‌తో చనిపోయిందని మణిపూర్ వ్యక్తి  ఏం చేస్తున్నాడో తెలుసా?

Manipur: తన భార్య క్యాన్సర్‌తో చనిపోయిందని మణిపూర్ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా?

Anil kumar poka

|

Updated on: Mar 12, 2024 | 7:59 PM

ప్రతి వ్యక్తి తన సంపాదనను పొదుపు చేసి కూడబెట్టుకోవడంలో బిజీగా ఉన్న తరుణంలో.. మణిపూర్‌కు చెందిన వ్యక్తి వారానికి 6 రోజులు పని చేసి.. ఏడవ రోజున తన సంపాదన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేస్తున్నాడు. డబ్బుని అందునా తన కష్టార్జితాన్ని తృణపాయంగా భావిస్తూ సంపాదన అంతా దానం చేస్తున్నాడు. అలాగని ఆయన ఏదో ఒక ఒక పెద్ద కంపెనీలో పని చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడనుకుంటే పొరపాటే.!

ప్రతి వ్యక్తి తన సంపాదనను పొదుపు చేసి కూడబెట్టుకోవడంలో బిజీగా ఉన్న తరుణంలో.. మణిపూర్‌కు చెందిన వ్యక్తి వారానికి 6 రోజులు పని చేసి.. ఏడవ రోజున తన సంపాదన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేస్తున్నాడు. డబ్బుని అందునా తన కష్టార్జితాన్ని తృణపాయంగా భావిస్తూ సంపాదన అంతా దానం చేస్తున్నాడు. అలాగని ఆయన ఏదో ఒక ఒక పెద్ద కంపెనీలో పని చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఈ కలియుగ దాన కర్ణుడు చేస్తున్నది చెరకు రసం అమ్మే వ్యాపారం. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో నివాసముంటున్న లాంగ్‌జామ్ లోకేంద్ర సింగ్ చెరకు రసం విక్రయిస్తున్నాడు. 49 ఏళ్ల లాంగ్‌జామ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరకు రసాన్ని అమ్ముతాడు. అలా జ్యూస్ అమ్ముతూ వారమంతా సంపాదిస్తాడు. ఈ డబ్బుని ఖర్చు పెట్టకుండా.. ఆ తర్వాత వచ్చే శుక్రవారం రోజున తన సంపాదనలో ప్రతి రూపాయిని క్యాన్సర్ రోగులకు విరాళంగా అందిస్తున్నాడు. వాస్తవానికి ఇతరులకు సహాయం చేస్తున్న లాంగ్‌జామ్ కు ఈ చర్యల వెనుక ఓ కారణం ఉంది. ఆయన భార్య 2013 సంవత్సరంలో క్యాన్సర్‌తో మరణించిందని … అప్పట్లో తాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, దాంతో తన లాంటి కష్టం ఎవరికీ రాకూడదని అనుకున్నట్టు చెప్పాడు. అప్పటి నుంచి క్యాన్సర్ పేషెంట్లకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..