Drones: రెట్టింపు సంఖ్యలో సరిహద్దు దాటుతున్న డ్రోన్లు.. మన వద్ద పరిష్కారం అయితే..
శత్రు సైన్యానికి చెందిన డ్రోన్లు మన దేశంలోకి ప్రవేశించడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఎప్పటికప్పుడు బోర్డర్ వద్ద కనిపిస్తున్న డ్రోన్లను పేల్చివేస్తున్నా..
శత్రు సైన్యానికి చెందిన డ్రోన్లు మన దేశంలోకి ప్రవేశించడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఎప్పటికప్పుడు బోర్డర్ వద్ద కనిపిస్తున్న డ్రోన్లను పేల్చివేస్తున్నా.. వీటి సంఖ్య తగ్గుముఖం పట్టడంలేదు. ఈ విషయంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావలసిన చర్యలు తీసుకుంటుూనే ఉంది. తాజాగా ఈ సమస్యకు తమ వద్ద పరిష్కారం ఉందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. దేశంలోకి ప్రవేశిస్తున్న డ్రోన్లు ఎక్కడి నుంచి, ఏ కారణంగా వస్తున్నాయనే విషయాలకు సంబంధించిన సమాచారం కనుగొనడానికి కావలసిన టెక్నాలజీ ఉందని వారు అంటున్నారు.
డ్రోన్‌ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను చేరవేసే ఘటనలు గడిచిన సంవత్సరాల కంటే ఈ ఏడాది రెట్టింపయ్యాయని బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ శనివారం తెలిపారు. పశ్చిమ భాగంలోని సైన్యం మీద పాకిస్థాన్ డ్రోన్‌ల ద్వారా బాంబులు వేసిందని, మున్ముందు కాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడానికి తమ విభాగం పనిచేస్తుందని తెలిపారు. ఇందుకు ఢిల్లీలోని అత్యాధునిక లాబొరేటరీ చాలా సానుకూలంగా సహాయపడుతోందని తెలిపారు. 2020 సంవత్సరంలో భారత్-పాక్ సరిహద్దులలో మొత్తం 79 డ్రోన్లను కనుగొనగా.. దాని సంఖ్య 2021 లో 109 గా ఉందన్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటికే 266 డ్రోన్లన కనిపెట్టామని, గతంలో కంటే ఇది రెట్టింపుగా ఉందిన తెలిపారు. ఇందులో భాగంగా పంజాబ్ బోర్డర్‌లో 215, కాశ్మీర్ బోర్డర్‌లో 22 డ్రోన్ విమానాలను కనుగున్నామని పేర్కొన్నారు.
‘‘డ్రోన్ దాడులను కట్టడిచేయడంలో బీఎస్ఎఫ్ చివరి దశలో ఉంది. డ్రోన్‌లోని భాగాల గురించి తెలియజేసే విషయాలు సమాచారం లేకపోవడంతో ప్రారంభంలో కొంత సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సమస్య ఏ మాత్రం లేదు. ఇఫ్పుడు మేము ఫొరెన్సిక్ విభాగంలోకి ప్రవేశించి, డ్రోన్‌లలో ఉపయోగించే పరికరాల గురించి తెలుసుకోవడం ప్రారంభించాం. వాటి గురించి సమగ్రంగా తెలుసుకోగలుగుతున్నాం. సైబర్ నేరాలను అరికట్టడంలో డిజిటల్ ఫొరెన్సిక్ సహాయం ఉండడంతో మాకు ఉన్న చాలా సమస్యలకు సమాధానం లభించింది’’ అని పంకజ్ సింగ్ వెల్లడించారు. అంతేకాక పంజాబ్ పోలీసులు, బీఎస్ఎఫ్‌కు చెందిన 200 మంది సైనికులు కలిసి దేశంలోకి ప్రవేశించే డ్రోన్లపై పటిష్ఠమైన నిఘా పెట్టినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..