16 November 2024
Pic credit - Getty
TV9 Telugu
చలికాలంలో వేడి ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. తద్వారా శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది, తేనె , బెల్లం రెండూ వేడి ఆహారం.. అయితే ఏది ఎక్కువ ప్రయోజనకరం?
కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఐరన్, ఫైబర్, పొటాషియం మొదలైన పోషకాలు తేనెలో లభిస్తాయి.
బెల్లంలో మాంసకృత్తులు, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, విటమిన్ సి వంటి మంచి పోషకాలు ఉన్నాయి.
బెల్లం.. తేనె మధ్య ప్రయోజనాల గురించి మనం మాట్లాడినట్లయితే.. రెండూ పోషకాలతో నిండి ఉన్నాయి. అయితే కొన్ని పరిస్థితులలో తేనె మంచిది.
తేనె, బెల్లం రెండూ చక్కెరకు ప్రత్యామ్నాయాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే బెల్లంలో ఎక్కువ గ్లైసెమిక్ ఉంది. కాబట్టి తేనె మంచిది. అయినప్పటికీ మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని మితంగా తినాలి
శీతాకాలంలో తేనె గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. త్వరగా శక్తిని అందిస్తుంది.
బెల్లం వినియోగం గురించి మాట్లాడుతే రక్తహీనతతో బాధపడేవారికి ఇది అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఇరెన్ అధికంగా ఉంటుంది.