Samantha: సమంతకు అమాంతం క్రేజ్ తెచ్చిపెట్టిన సిటాడెల్
పర్ఫెక్ట్ సినిమా ఒక్కటి పడితే చాలు... ఓవర్‌నైట్ క్రేజ్ సొంతమవుతుంది. అలాంటిది 150 దేశాల్లో హవా చాటుతున్న ప్రాజెక్ట్ తో ప్రొజెక్ట్ కావడమంటే మాటలా? ఏదేమైనా కమ్‌బ్యాక్‌ని సామ్ గట్టిగా ప్లాన్ చేసుకున్నారనే పేరు బాగా వినిపిస్తోంది. ఇంతకీ సమంత నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతోంది? సిటాడెల్‌హనీ బన్నీని మీరు చూశారా? ఇంకా చూడలేదా?... ఇలాంటి డిస్కషనే జరుగుతోంది డిజిటల్ కంటెంట్ లవర్స్ మధ్య.
Updated on: Nov 16, 2024 | 9:58 PM

పర్ఫెక్ట్ సినిమా ఒక్కటి పడితే చాలు... ఓవర్‌నైట్ క్రేజ్ సొంతమవుతుంది. అలాంటిది 150 దేశాల్లో హవా చాటుతున్న ప్రాజెక్ట్ తో ప్రొజెక్ట్ కావడమంటే మాటలా? ఏదేమైనా కమ్‌బ్యాక్‌ని సామ్ గట్టిగా ప్లాన్ చేసుకున్నారనే పేరు బాగా వినిపిస్తోంది. ఇంతకీ సమంత నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతోంది?

సిటాడెల్‌హనీ బన్నీని మీరు చూశారా? ఇంకా చూడలేదా?... ఇలాంటి డిస్కషనే జరుగుతోంది డిజిటల్ కంటెంట్ లవర్స్ మధ్య. అమేజాన్‌లో రిలీజ్ అయిన సిటాడెల్‌కి మంచి స్పందన వస్తోంది. వరల్డ్ వైడ్ ఎక్కువ మంది చూసిన సీరీస్‌గా క్రెడిట్ సొంతం చేసుకుంది సిటాడెల్.

దాదాపు 200 కంట్రీస్‌లో సిటాడెల్ హనీ బన్నీ ప్రసారమవుతోంది. అందులో 150 దేశాల్లో టాప్‌లో ఉంది ఈ సీరీస్. అసలు ప్రాజెక్ట్ పూర్తి చేయడమే కష్టంగా అనిపించిందని, ఇప్పుడు ఇంత మంది ఆదరణ చూస్తుంటే కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని అంటున్నారు మేకర్స్.

వరల్డ్ వైడ్ సిటాడెల్ తుఫాను క్రియేట్ చేస్తోంది. ఆదరణకు చాలా హ్యాపీగా ఉందని అంటున్నారు సామ్. సిటాడెల్ సీక్వెల్‌ని వెబ్ సీరీస్‌గా కాకుండా, సినిమాగా తీసే ప్లాన్స్ లో ఉన్నారట మేకర్స్.

అదే జరిగితే సామ్ రీఎంట్రీ నార్త్ లో భారీగా ఉన్నట్టే లెక్క. నేను ఫిట్‌గా ఉన్నాను. రెడీ టు డు వర్క్ అని ఇప్పటికే హింట్ ఇచ్చిన సామ్.. ఇకపై రెగ్యులర్ ప్రాజెక్టులతో రెచ్చిపోవడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది.




