Ashwini Vaishnav: ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి అశ్విని వైష్ణవ్
భారతదేశంలో 35 వేల దినపత్రికలు, వెయ్యి రిజిస్టర్డ్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయని తెలిపారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇప్పుడు లక్షలాది మందికి వార్తలు చేరుతున్నాయని, దీని వల్ల మీడియా పెరుగుతోందన్నారు. భారతదేశంలో డిజిటల్..
ఫేక్ న్యూస్ నేడు ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. తప్పుడు సమాచారం కారణంగా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా అల్లర్లు ఏర్పడుతున్నాయని అన్నారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. శనివారం న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు. సమాజంలో స్వేచ్ఛాయుతమైన, బాధ్యతాయుతమైన పత్రికా వ్యవస్థ ముఖ్యమైన పాత్రను హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
కంటెంట్ క్రియేటర్లు, ప్లాట్‌ఫారమ్‌లు, ప్లాట్‌ఫారమ్‌కు ఎక్కువ మంది వచ్చే విధంగా అల్గారిథమ్ తయారు చేయబడుతోందని, ఇలాంటి మరిన్ని కంటెంట్ ఈ ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ అవుతున్నాయని అన్నారు. కానీ ఎన్నో మతాలు, భాషలు ఉన్న మన దేశంలో దీన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించడం పెద్ద సవాలు అని పేర్కొన్నారు. కాలంతో పాటు మీడియా దృక్పథం మారిందని, కచ్చితమైన, వాస్తవాధారమైన వార్తలను ప్రజలకు అందించడమే నేడు మీడియా ముందున్న అతిపెద్ద సవాలు అని అన్నారు. పత్రికా స్వేచ్ఛ కోసం మీడియా సుదీర్ఘ పోరాటం చేసిందని, మొదట బ్రిటీష్ పాలనలో, తరువాత 1975 ఎమర్జెన్సీ సమయంలోనూ పోరాటం చేసిందన్నారు.
భారతదేశంలో 35 వేల దినపత్రికలు, వెయ్యి రిజిస్టర్డ్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయని తెలిపారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇప్పుడు లక్షలాది మందికి వార్తలు చేరుతున్నాయని, దీని వల్ల మీడియా పెరుగుతోందన్నారు. భారతదేశంలో డిజిటల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందుతోందని వైష్ణవ్ అంగీకరిస్తూనే, తప్పుదోవ పట్టించే, నకిలీ వార్తల వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు అవగాహన పెంచడమే మీడియా పని అని అన్నారు. ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేయడానికి ఎవరు బాధ్యులని గుర్తించడం ఈ రోజు ముఖ్యమైన సమస్యగా మారుతోందన్నారు. మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలు కూడా మొబైల్ ఫోన్‌ల ద్వారా దేశం, ప్రపంచ వార్తలతో అప్‌డేట్ అవుతారు. అందుకే డిజిటల్ మీడియా వాస్తవ కంటెంట‌్‌ను అందించడంపై దృష్టి పెట్టాలని కోరారు.
Four challenges we face today;
1. Fake news & disinformation 2. Fair compensation by platforms 3. Algorithmic bias 4. Impact of AI on Intellectual Property pic.twitter.com/TWoYZEUQD2
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 16, 2024
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అతిపెద్ద సవాలు అని, నిజమైన కంటెంట్ సృష్టికర్తలకు ఇది పెద్ద సవాలుగా మారుతోందన్నారు. ఈ సవాళ్లను మనం ఒక సమాజంగా, దేశంగా చూడాలని, 2047లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టించాలంటే సామరస్యపూర్వకమైన సమాజం కావాలని మంత్రి కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి