AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: మెగా వేలంలో రిటైర్మెంట్ ప్రకటించిన టాప్-5 ప్లేయర్లు.. దక్కించుకునే ప్రాంచైజీ ఏది..?

ఐపీఎల్ 2025 మెగా వేలం సమీపిస్తున్న నేపథ్యంలో, జేమ్స్ అండర్సన్, డేవిడ్ వార్నర్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, ట్రెంట్ బౌల్ట్ వంటి ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ వేలంలో పాల్గొంటున్నారు. ఐపీఎల్ వేలంలో భాగమయ్యే అండర్సన్‌ మొదటి సారి అతని పేరు నమోదు చేసుకున్నాడు. అతని బేస్ ధర ₹1.25 కోట్లు ఉంది. గత సీజన్లలో కీలకపాత్ర పోషించిన వారైన వార్నర్, డు ప్లెసిస్, అలీ, బౌల్ట్ ఈసారి తమ గత జట్ల నుంచి విడిపోయి కొత్త ఫ్రాంచైజీల కోసం చూస్తున్నారు.

IPL 2025: మెగా వేలంలో రిటైర్మెంట్ ప్రకటించిన టాప్-5 ప్లేయర్లు.. దక్కించుకునే ప్రాంచైజీ ఏది..?
Faf Du Plesis
Narsimha
|

Updated on: Nov 16, 2024 | 9:32 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం ప్రక్రియకు సమయం దగ్గరపడుతోంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. తాజాగా IPL 2025 ఎడిషన్ కోసం నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాను BCCI వెల్లడించింది. IPL 2025 ఎడిషన్ కోసం మెగా వేలం రంగంలో ఉన్న కొంతమంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి టాప్ ఫైవ్ స్టార్ ప్లేయర్స్ గురించిన పూర్తి సమాచారం ఇదిగో.

1. జేమ్స్ ఆండర్సన్:

ఈసారి ఐపీఎల్ వేలం ప్రక్రియలో జేమ్స్ అండర్సన్ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో అండర్సన్ ఐపీఎల్ వేలం కోసం నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి. ఇటీవలే రిటైరైన టెస్ట్ స్పెషలిస్ట్ అయిన అండర్సన్, జూలై 2024లో లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అండర్సన్ ఇప్పుడు తన బేస్ ధరను రూ.1.25 కోట్లకు పెంచాడు.

2. డేవిడ్ వార్నర్:

ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ వేలంలో తన పేరును ఉంచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా నుండి వార్నర్ తొలగించబడ్డాడు. ఐపీఎల్‌లో వార్నర్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బౌండరీలు (663) బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అలాగే, అతను అత్యధిక అర్ధ సెంచరీలు (66) తన పేరిట ఉన్న రికార్డును కలిగి ఉన్నాడు. 2016 లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ట్రోఫీని అందించిన కెప్టెన్.

3. ఫాఫ్ డు ప్లెసిస్:

2022 నుండి 2024 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి నాయకత్వం వహించిన కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, రాబోయే ఎడిషన్ కోసం ఫ్రాంచైజీ అతడిని కొనసాగించలేదు. ఫాఫ్ గత రెండు ఎడిషన్లలో RCB జట్టుకు చాలా సహకారం అందించాడు. IPL 2024లో, RCB అతని నాయకత్వంలో వరుసగా 7 విజయాలతో ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించింది.

4. మొయిన్ అలీ:

ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మొయిన్ అలీ 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తరపున ఐపిఎల్‌లో అరంగేట్రం చేశాడు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగమయ్యాడు. 2023లో CSK ఐదో ఐపీఎల్ టైటిల్ గెలవడంలో అలీ కీలకపాత్ర పోషించాడు. కానీ CSK IPL 2025 టోర్నమెంట్ కోసం అలీని రిటైన్ చేయలేదు. ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 67 మ్యాచ్‌లు ఆడి 1162 పరుగులు చేశాడు. మొయిన్ అలీకి ఐపీఎల్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఫ్రాంచైజీ లీగ్‌లలో కూడా అపారమైన అనుభవం ఉంది.

5. ట్రెంట్ బౌల్ట్:

ప్రమాదకరమైన స్వింగ్ బౌలర్లలో ఒకరైన న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి దూరమయ్యాడు. పవర్‌ప్లే ఓవర్లలో బౌల్ట్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు మెగా వేలంలో కనిపించిన బౌల్ట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. టీమ్ ఇండియా ఆటగాడు భువనేశ్వర్ కుమార్ తర్వాత, పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు (63) తీసిన బౌలర్‌గా బౌల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 104 మ్యాచ్‌లు ఆడిన బోల్ట్ 121 వికెట్లు పడగొట్టాడు.

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే