Lottery king: ‘లాటరీ కింగ్’ ఇంట్లో ఈడీ సోదాలు.. గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు

ఓ లాటరీ కింగ్ ప్రభుత్వానికే టోపీ పెట్టాడు. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా కోట్లాది విలువైన ఆస్తులు, నగదు బయటపడింది. ఇంతకీ ఎక్కడ జరిగింది? ఎవరా లాటరీ కింగ్ ?

Lottery king: ‘లాటరీ కింగ్’ ఇంట్లో ఈడీ సోదాలు..  గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు
Lottery King Santiago Martin's ₹8.8 Crore Seized In Ed Searches In Chennai
Follow us
Ch Murali

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 16, 2024 | 3:13 PM

ఓ లాటరీ కింగ్‌పై మనీలాండరింగ్ అభియోగాలకు సంబంధించి రంగంలోకి దిగిన ఈడీ అధికారులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా కోట్లాది విలువైన ఆస్తులు, నగదు బయటపడింది. లాటరీ వ్యాపారాలు చేస్తూ కోట్లలో ప్రభుత్వానికి నష్టం కలిగించడంతోపాటు.. వ్యాపారాల్లో పలువురిని మోసం చేశారన్న అభియోగాలు కూడా ఉండగా పోలీసులు కూడా ఫిర్యాదులు అందాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఆధారాలు లేవంటూ కేసులు క్లోజ్ చేశారు. లాటరీ కింగ్ గా పిలవబడే అతగాడిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన అధికారులు అతని బండారం మొత్తం బయటపెట్టారు. ఇంతకీ ఎక్కడ జరిగింది? ఎవరా లాటరీ కింగ్ ?

లాటరీ వ్యాపారం గురించి చాలామందికి తెలుసు కాకపోతే అవి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమల్లో ఉంది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో జరిగే లాటరీ విక్రయాలు ఎక్కువగా కేరళ సిక్కింలలో జరుగుతుంటాయి.. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే లాటరీ వ్యాపారం.. ప్రతి ఏటా వందల కోట్లలోనే ఉంటుంది.. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి జరిగిన వ్యాపారాల్లో అవకతవకలపై విచారణ జరిగితే డొంక తమిళనాడులో ఉన్నట్టు తెలిసింది. శాంటియాగో మార్టిన్ ఇతను లాటరీ వ్యాపారంతో మొదలై దాని ద్వారా వచ్చిన ఆదాయంతో అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. టెక్స్‌టైల్‌ రంగం సహా గేమింగ్ వ్యాపారాల్లో కూడా భాగస్వామిగా ఉన్న మార్టిన్ లాటరీ వ్యాపారం పేరుతో మోసపూరితంగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి గండి కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. మార్టిన్ చేసే లాటరీ దందా ద్వారా సిక్కిం ప్రభుత్వానికి దాదాపు 900 కోట్ల నష్టం వాటిల్లిందని అక్కడి ప్రభుత్వమే అభియోగాలు చేసింది.

ప్రభుత్వానికి తెలియకుండా సమాంతరంగా మరో వ్యవస్థను ఏర్పాటు చేసి లాటరీ వ్యాపారం చేస్తూ వందల కోట్లు అక్రమంగా వెనకేసారన్న ఆరోపణలు ఉన్నాయి. మార్టిన్ పై తమిళనాడులోని కోయంబత్తూర్ తో పాటు పలు నగరాల్లో పోలీస్ కేసులు ఉన్నాయి. అయితే ఈ కేసుల్లో ఏవి కూడా విచారణ పూర్తిగా కాలేదు. సరైన ఆధారాలు లేవంటూ దాదాపు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా పోలీసులు కేసులను మూసివేశారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఈడీ రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. దీంతో సిక్కిం ప్రభుత్వం, అలాగే పలు రాష్ట్రాల్లో ఆయనపై వచ్చిన ఫిర్యాదులతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నేరుగా రంగంలోకి దిగింది. చెన్నైలో గత నాలుగు రోజులుగా చేసిన సోదరులు కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. నివాసం కార్యాలయాల్లో 8.8 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్టిన్ అతని అల్లుడు యాదవ్ అర్జున్ వారి సహచరుల ఇండ్లపై దాదాపు 20చోట్ల సోదాలు జరగగా రాజకీయ పార్టీలకు దాదాపు 1300 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను ఇచ్చినట్లుగా గుర్తించారు. పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదుతో 2023లో ప్రభుత్వానికి 900 కోట్ల నష్టం వాటిల్లిన కేసులో మార్టిన్ కు చెందిన 450 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్ చేసింది. మార్టిన్ పై ఇప్పటివరకు కేవలం సిక్కిం ప్రభుత్వానికి నష్టం వాటిల్లిన కేసు అలాగే తమిళనాడులో పలువురు వ్యాపారస్తులు తమను మోసం చేసిన కేసుల్లో మాత్రమే ఇతని అక్రమాలు ఇప్పటివరకు వెలుగు చూశాయి. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే లాటరీ కింగ్ గా పిలువబడే మార్టిన్ అక్రమాలు ఇంకెన్ని బయటపడతాయో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి