26 December 2024
ప్రభాస్ దగ్గరున్న విలువైన వస్తువులు ఇవే.. ఆస్తులు ఎంతో తెలుసా..
Rajitha Chanti
Pic credit - Instagram
దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ప్రభాస్ ఒకరు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు డార్లింగ్ ప్రాజెక్టుల కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.
ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే కల్కి 2, సలార్ 2, స్పిరిట్ వంటి చిత్రాలు త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే నివేదికల ప్రకారం ప్రభాస్ ఆస్తులు రూ.241 కోట్లు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.100 కోట్లు తీసుకుంటాడట.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రభాస్ కు విలావంతమైన భవనం ఉంది. నివేదికల ప్రకారం ఆ ఇల్లు ఖరీదు దాదారు రూ. 60 కోట్లకు పైగానే ఉంటుందట.
ప్రభాస్ సొంత జిమ్ లో 1.5 కోట్ల విలువైన పరికరాలు ఉన్నాయట. ముంబై, ఇటలీ వంటి దేశాల్లో ప్రభాస్ కు సొంతంగా ఇళ్లు ఉన్నట్లు సమాచారం.
ప్రభాస్ గ్యారేజీలో లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. 1 కోటి విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్, 60 లక్షల విలువైన ఆడి A6, 2 కోట్ల విలువైన BMW 7 సిరీస్.
2 కోట్ల విలువైన Mercedes Benz S క్లాస్, 1 కోటి విలువైన జాగ్వార్ XJL పోర్ట్‌ఫోలియో, 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి కార్లు ఉన్నాయట.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్