Chimney Blast: ఇటుక బట్టీకి నిప్పు పెడుతుండగా చిమ్నీ పేలుడు.. ఆరుగురి మృతదేహలు వెలికితీత.. పదుల సంఖ్యలో కూలీలు గల్లంతు..!
గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇటుక బట్టీకి నిప్పు పెడుతుండగా చిమ్నీ పేలింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 మంది మృతి చెందగా, చిమ్నీ యజమానితో సహా 22 మంది కూలీలు గాయపడ్డారు. దాదాపు అర డజను మందిని ఆసుపత్రిలో చేర్చగా, 20 మందికి పైగా గల్లంతయ్యారు. అగ్నిమాపక దళం ఫైరింజన్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టింది. 10 అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ విషాద సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బట్టీ అడుగున పదుల సంఖ్యలో చిక్కుకున్న వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
బీహార్‌లోని రక్సౌల్‌లో ఇటుక బట్టీలో చిమ్నీ పేలుడు సంభవించి 6 మంది మరణించారు. కాగా 12 మందికి పైగా గాయపడ్డారు. కేవలం 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. సైట్ వద్ద చీకటి కారణంగా, రెస్క్యూ సమస్యగా మారిందని తెలిసింది.. ఈ సంఘటన రామ్‌గర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారిర్‌గిర్ గ్రామ సమీపంలో జరిగింది. కొలిమి కింద ఇంకా చాలా మంది ఉన్నట్టుగా తెలిసింది.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సహాయక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఘటనతో అక్కడంతా భయాక వాతావరణం నేలకొంది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.