Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్.. రాహుల్ తో కలిసి నడవనున్న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు

రాహుల్‌ గాంధీ ఆహ్వానం మేరకు వచ్చే వారంలో కమల్‌ హాసన్‌ ఈ యాత్రలో పాల్గొంటారని మక్కల్‌ నీది మయ్యం పార్టీ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్‌ 24 న ఈ యాత్రలో రాహుల్‌ తో కలిసి..

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్.. రాహుల్ తో కలిసి నడవనున్న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు
Kamal Haasan And Rahul Gand
Follow us

|

Updated on: Dec 23, 2022 | 7:53 PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు విశేషంగా మద్దతు లభిస్తుంది. అటు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగ సెలబ్రిటీలు భారీగా హాజరవుతున్నారు. ఈ క్రమంలో శనివారం మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, నటుడు కమల్ హాసన్ భారత్ జోడో యాత్రలో పాల్గొనున్నారు. రాహుల్‌ గాంధీ ఆహ్వానం మేరకు వచ్చే వారంలో కమల్‌ హాసన్‌ ఈ యాత్రలో పాల్గొంటారని మక్కల్‌ నీది మయ్యం పార్టీ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్‌ 24 న ఈ యాత్రలో రాహుల్‌ తో కలిసి నడవనున్నారని తెలిపాయి. ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్ర డిసెంబర్‌ 24 న దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించనుంది. సెప్టెంబరు 7న కన్యాకుమారిలో మొదలైన ‘భారత్‌ జోడో యాత్ర’ తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల మీదుగా ప్రస్తుతం రాజస్థాన్‌ లో కొనసాగుతోంది.

దేశ రాజధానిలో జరిగే యాత్రలో కనీసం 40,000 నుంచి 50,000 మంది యాత్రికులు పాల్గొంటారని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి తెలిపారు. భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హర్యానాలో ఉంది. దేశ రాజధానిలో జరిగే భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్లమెంటేరియన్లు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, మక్కల్ నీది మయ్యం (ఎంకెఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి.

శనివారం రాత్రి ప్రారంభమయ్యే చిన్న విరామం తర్వాత, జనవరి 3 నుండి ఉత్తరప్రదేశ్ నుండి యాత్ర పునఃప్రారంభించబడుతుంది. తర్వాత మళ్లీ రెండవ దశలో హర్యానాకు ఆపై పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌కు వెళుతుంది.

సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పర్యటించింది. డిసెంబర్ 16తో 100 రోజులు పూర్తి చేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?