India Corona Cases: కోవిడ్‌పై కేంద్రం హై అలెర్ట్.. మాస్క్ తప్పనిసరి చేయాలని రాష్ట్రాలకు మరో లేఖ

కోవిడ్‌పై రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ రాసింది. పండుగలు, న్యూ ఇయర్‌ వేడుకల సమయంలో ప్రజలు మాస్క్‌లు, భౌతికదూరం పాటించేలా చూడాలని రాష్ట్రాల సీఎస్‌లకు రాసిన లేఖలో పేర్కొన్నారు

India Corona Cases: కోవిడ్‌పై కేంద్రం హై అలెర్ట్.. మాస్క్ తప్పనిసరి చేయాలని రాష్ట్రాలకు మరో లేఖ
Corona Virus
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 23, 2022 | 6:07 PM

బీఅలర్ట్‌. తేడా వస్తే ప్రాణాలు పోతాయ్. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలి. ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చర్యలు తీసుకోవాలంటోంది కేంద్ర సర్కార్. కోవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ రాసింది. టెస్ట్ – ట్రాక్ – ట్రీట్‌తో పాటు.. వ్యాక్సినేషన్ చేపట్టాలని అందులో సూచనలు చేసింది. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన చర్యలు ఉండాలంటోంది కేంద్రం. మాస్క్‌లు ధరించడం, వ్యక్తిగత శుభ్రత, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ అన్నిరాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అత్యవసర పరిస్థితులు వస్తే ఎలా తట్టుకోవాలన్న విషయంపై వచ్చే మంగళవారం దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్‌కు ఏర్పాట్లు చేశారు. పేషంట్ల రద్దీ పెరిగితే ఏం చేయాలి ? ఆక్సిజన్‌ నిల్వలు ఎలా ఉండాలన్న విషయంపై మాక్‌డ్రిల్‌లో రివ్యూ చేస్తున్నారు. B.F.7 ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ల్లో మాస్క్‌లను కంపల్సరీ చేసింది కేంద్రం.

మరోవైపు ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్ టీకాకు కేంద్రం ఓకే చెప్పింది. శుక్రవారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. రెండు చుక్కల నాస‌ల్ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది భారత్‌కు రానున్న 20-35 రోజులు చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. చైనా , అమెరికా , యూరప్‌ తరువాత కొత్త వేరియంట్‌ దక్షిణాసియాలో ప్రవేశిస్తుందని చెబుతున్నారు. చైనాతో పాటు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టి పెట్టారు అధికారులు. కరోనా కారణంగా షిర్డీ ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో ఎంట్రీకి మాస్క్‌లను కంపల్సరీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!