యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్.. రాత్రిపూట బ్లాక్అవుట్!
యుద్ధ పరిస్థితిని ఎదుర్కోవడానికి, మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించారు. రాత్రిపూట బ్లాక్‌అవుట్ విధించారు. పాకిస్తాన్‌తో ఉద్రిక్తత మధ్య, దేశంలో తొలిసారిగా మాల్ డ్రిల్ నిర్వహించారు. దీనికి ముందు, మాక్ డ్రిల్ 1971 లో నిర్వహించారు. తాజాగా దేశవ్యాప్తంగా 295 ప్రదేశాలలో మాక్ డ్రిల్‌లు నిర్వహించారు. మాక్ డ్రిల్, బ్లాక్అవుట్ సమయం అన్ని ప్రదేశాలలో భిన్నంగా ఉంది.

దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన మాక్‌డ్రిల్‌లో.. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, రక్షణశాఖ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సైరన్లు మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పించారు. పలు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే రాత్రి వేళ శత్రువు కంటికి కనిపించకుండా బ్లాక్‌అవుట్ పాటించారు.
పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. యుద్ధ పరిస్థితిని ఎదుర్కోవడానికి, మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించారు. రాత్రిపూట బ్లాక్‌అవుట్ విధించారు. అయితే, మాక్ డ్రిల్ ప్రారంభం కావడానికి ముందే, భారతదేశం బుధవారం తెల్లవారు జామున పాకిస్తాన్‌పై దాడి చేసింది. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్, బ్లాక్అవుట్లను నిర్వహించారు.
#WATCH जयपुर (राजस्थान): सिविल डिफेंस मॉक ड्रिल के दौरान जयपुर में ब्लैकआउट किया गया। pic.twitter.com/oSo3nDqU0Z
— ANI_HindiNews (@AHindinews) May 7, 2025
ఈ మాక్ డ్రిల్‌లో సైరన్ పరీక్ష, బ్లాక్అవుట్ నిర్వహించారు. దీని ఉద్దేశ్యం ప్రజల భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు యుద్ధ ముప్పులను ఎదుర్కోవటానికి సామర్థ్యాన్ని పెంచడం. గతంలో, 1971లో ఇండో-పాక్ యుద్ధం సమయంలో ఇంత పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహించారు. తాజాగా దేశవ్యాప్తంగా 295 చోట్ల మాక్ డ్రిల్‌లు నిర్వహించారు. అన్ని చోట్ల సమయం భిన్నంగా ఉంది.
#WATCH पंजाब: सिविल डिफेंस मॉक ड्रिल के दौरान अमर्तसर में ब्लैकआउट किया गया।
वीडियो स्वर्ण मंदिर से है। pic.twitter.com/raCeBqTrsB
— ANI_HindiNews (@AHindinews) May 7, 2025
చాలా చోట్ల బ్లాక్అవుట్ సమయం రాత్రి 8 నుండి 8:15 వరకు చేపట్టారు. సరిహద్దు ప్రాంతాల్లో సమయం రాత్రి 10 గంటల తర్వాత. ఈ సమయంలో, లైట్లు ఆపివేయమని ప్రజలకు సూచించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాన్ని అనుసరించి, బుధవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్‌లు నిర్వహించారు. రాత్రిపూట మాక్ డ్రిల్‌ల సమయంలో బ్లాక్‌అవుట్ అమలు చేశారు. ఈ సమయంలో అన్ని లైట్లు కొంతసేపు ఆపివేశారు.
#WATCH | Blackout in Chandigarh, as part of the mock drill ordered by the MHA. pic.twitter.com/EEXQbIKIQh
— ANI (@ANI) May 7, 2025
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించడం ద్వారా పాకిస్తాన్‌పై దాడి చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 9 ఉగ్రవాదుల దాక్కున్న స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విధంగా భారతదేశం పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. దీని తర్వాత, భారతదేశం ఖచ్చితంగా ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కానీ ఇంత త్వరగా ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. భారత సైన్యం పాకిస్తాన్ పిఓకెలోకి ప్రవేశించి ఒకేసారి 9 ప్రదేశాలపై దాడి చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




