Coronavirus: డేంజ‌ర్ బెల్స్.. ఒకే రోగిలో బ్లాక్​, వైట్​ ఫంగస్​ గుర్తింపు.. ఇవి ల‌క్ష‌ణాలు

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో ఓ రోగిలో బ్లాక్​, వైట్​ ఫంగస్​లను డాక్ట‌ర్లు గుర్తించారు. దేశంలో ఇలాంటి కేసు నమోదవటం ఇదే ఫ‌స్ట్ టైమ్. ప్రస్తుతం స‌ద‌రు రోగి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు

Coronavirus:   డేంజ‌ర్ బెల్స్..  ఒకే రోగిలో బ్లాక్​, వైట్​ ఫంగస్​ గుర్తింపు.. ఇవి ల‌క్ష‌ణాలు
Black And White Fungus
Follow us

|

Updated on: May 23, 2021 | 12:37 PM

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో ఓ రోగిలో బ్లాక్​, వైట్​ ఫంగస్​లను డాక్ట‌ర్లు గుర్తించారు. దేశంలో ఇలాంటి కేసు నమోదవటం ఇదే ఫ‌స్ట్ టైమ్. ప్రస్తుతం స‌ద‌రు రోగి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. భోపాల్​లో మరో కేసు నమోదైంది. ఓ రోగిలో బ్లాక్, వైట్​ ఫంగస్​ ఉన్న‌ట్లు తేలింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్లాక్​ఫంగస్​ పంజా విసురుతోంది. మరి కొన్ని రాష్ట్రాల్లో వైట్​ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో ఇలాంటి కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది.

బ్లాక్​ఫంగస్​ ల‌క్ష‌ణాలు..

* కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష వ‌ర్ధ‌న్‌ మంత్రి వెల్లడించారు.

* చక్కెర స్థాయి నియంత్రణలో లేనివారు, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల్లో భాగంగా రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వాడిన వారిలో ఈ వ్యాధి బయటపడుతోంది. * కరోనా చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న కొందరిలో దీన్ని గుర్తిస్తున్నారు.

వైట్​ ఫంగస్​ ల‌క్ష‌ణాలు..

☀ మెదడు, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, శ్వాసకోశ అవయవాలు, గోరు, మర్మాంగాలపై కూడా వైట్ ఫంగ‌స్ ప్రభావం చూపుతుంది.

☀ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి ఈ వైట్ ఫంగస్ చాలా డేంజ‌ర్. డయాబెటీస్, క్యాన్సర్ తదితర రోగాలతో బాధపడేవారు స్టిరాయిడ్లను అతిగా వాడినా ఈ సమస్య తప్పదు

☀ ఎక్కువ రోజులు ఆక్సిజన్ సపోర్టుతో ఉండేవారికి, నీటి కాలుష్యం వల్ల ఈ ఫంగస్ ఏర్పడవచ్చు

Also Read: పాస్ ప‌రేషాన్.. ఏపీ-తెలంగాణ బోర్డ‌ర్ల‌లో లొల్లి.. లొల్లి.

 వ్యాక్సిన్ల‌ను భుజానికే ఎందుకు ఇస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.? దానికి కార‌ణం ఇదే..