శరద్ పవార్ తో బీజేపీ ఎంపీ భేటీ .. ఇదెక్కడి వింత ?

మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు, ఏ వింత జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇటు బీజేపీ, అటు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మిత్ర పక్షాలుగా మారి.. ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకోగా.. బీజేపీ ఎంపీ సంజయ్ కకాడే ఆదివారం ఉదయం ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ తో భేటీ కావడం ఆశ్ఛర్యకర పరిణామం. వ్యక్తిగత కారణాలతోనే తాను శరద్ తో సమావేశమయ్యానని కకాడే చెబుతున్నప్పటికీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇది అనేక ఊహాగానాలకు తెర తీస్తోంది. […]

శరద్ పవార్ తో బీజేపీ ఎంపీ భేటీ .. ఇదెక్కడి వింత ?
Follow us
Anil kumar poka

|

Updated on: Nov 24, 2019 | 12:21 PM

మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు, ఏ వింత జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇటు బీజేపీ, అటు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మిత్ర పక్షాలుగా మారి.. ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకోగా.. బీజేపీ ఎంపీ సంజయ్ కకాడే ఆదివారం ఉదయం ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ తో భేటీ కావడం ఆశ్ఛర్యకర పరిణామం. వ్యక్తిగత కారణాలతోనే తాను శరద్ తో సమావేశమయ్యానని కకాడే చెబుతున్నప్పటికీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇది అనేక ఊహాగానాలకు తెర తీస్తోంది. ఎన్సీపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా అజిత్ పవార్ ని తొలగించి ఆయన స్థానే . ఈ పదవికి ఎంపికైన జయంత్ పాటిల్ కూడా కకాడే, శరద్ పవార్ ల సమావేశంలో పాల్గొనడం ఆసక్తికర విషయం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఫడ్నవీస్ ను గవర్నర్ ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ సేన, కాంగ్రెస్, ఎన్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో.. కోర్టు విచారణకు ముందే వీరి భేటీ జరిగింది. గతంలో ఎన్సీపీలో కొనసాగిన సంజయ్ కకాడే.. ఆ తరువాత కమలం పార్టీలో చేరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక శరద్ పవార్ తో భేటీ అయిన తొలి బీజేపీ నేత ఈయన.. శివసేనకు చెందిన సుమారు 45 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతునిచ్చేందుకు సిధ్ధంగా ఉన్నారని సంజయ్ అప్పుడే ‘ సన్నాయి నొక్కులు ‘ నొక్కడం ప్రారంభించారు. కాగా-అజిత్ పవార్ ను ఎన్సీపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా తొలగించడాన్ని బీజేపీ తప్పు పట్టింది. అజిత్ స్థానే జయంత్ పాటిల్ ను ఎన్నుకోవడం చెల్లదని ఈ పార్టీ అంటోంది. ఎన్సీపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడి హోదాలో అజిత్.. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు సమర్పించారని బీజేపీ నేత ఆశిష్ షెలార్ అంటున్నారు.