అర్ధరాత్రి హైడ్రామా వెనుక అమిత్ షా.. మరొకరెవరు ?

మహారాష్ట్రలో అర్ధరాత్రి జరిగిన హైడ్రామాకు తెర తీసిన సూత్రధారి బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా అపర చాణక్యుడిగా పాపులర్ అయ్యారు. భారత రాజకీయాల్లో తను ‘ మరో చాణక్యుడినే ‘ అని అమిత్ షా తనను తాను నిరూపించుకున్నారని బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ పేర్కొన్నారు. (రాష్ట్రంలో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే). అసలు శుక్రవారం […]

అర్ధరాత్రి హైడ్రామా వెనుక అమిత్ షా.. మరొకరెవరు ?
Follow us
Anil kumar poka

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 2:01 PM

మహారాష్ట్రలో అర్ధరాత్రి జరిగిన హైడ్రామాకు తెర తీసిన సూత్రధారి బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా అపర చాణక్యుడిగా పాపులర్ అయ్యారు. భారత రాజకీయాల్లో తను ‘ మరో చాణక్యుడినే ‘ అని అమిత్ షా తనను తాను నిరూపించుకున్నారని బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ పేర్కొన్నారు. (రాష్ట్రంలో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే). అసలు శుక్రవారం అర్ధరాత్రి ఏం జరిగింది ? శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేయే కాబోయే ముఖ్యమంత్రి అని, సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి చెక్కు చెదరలేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రకటించిన కొద్దీ సేపటికే పరిణామాలు మారిపోయాయి. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున సుమారు మూడు గంటలవరకు నడిచిన హైడ్రామా దేశ రాజకీయాలనే ఉక్కిరికిక్కిరి చేశాయి. అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ ని చడీ చప్పుడు కాకుండా ఢిల్లీ నుంచి ముంబైకి పంపారు. మీడియా స్పాట్ లైట్ గా పని చేసిన ఆయన రాక గురించి సేన గానీ కాంగ్రెస్ గానీ ఎన్సీపీ గానీ అసలు ఊహించలేదు. అర్ధరాత్రికి ముందు ఫడ్నవీస్, అజిత్ పవార్ ఓ ఒప్పందానికి వచ్చారని, ఆ తరువాత కొన్ని నిముషాలకే అమిత్ షాకు కాల్ వెళ్లిందని తెలిసింది. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ఫడ్నవీస్, భూపేంద్ర యాదవ్, అజిత్ పవార్ ముంబైలోను, ఢిల్లీలో అమిత్ షా నిద్రపోకుండా ‘ మంతనాలు ‘ జరుపుతూనే ఉన్నారట. ఆ రాత్రంతా వీళ్ళు మేల్కొనే ఉన్నారు. తెల్లవారుజామున నాలుగు-అయిదు గంటల మధ్య రాష్ట్ర గవర్నర్ కార్యదర్శికి ఢిల్లీ నుంచి.. రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తునట్టు కమ్యూనికేషన్ వచ్చిందట. కాగా.. అమిత్ షా ఆదేశాలమేరకే గవర్నర్ పని చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ‘ హతమార్చేందుకు ‘ బీజేపీ కాంట్రాక్టు కుదుర్చుకుందని ఆయన దుయ్యబట్టారు. అమిత్ షాకు మహారాష్ట్ర గవర్నర్ నమ్మిన బంటులా మారారని అన్నారు.