‘ కబడ్డీ ‘ లాంటిదే ‘ మహా ‘ పాలిటిక్స్ కూడా.. ఆనంద్ మహీంద్రా వీడియో .. వావ్ !

మహారాష్ట్రలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ‘ కబడ్డీ ‘ ఆటతో పోల్చారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ చివరి క్షణం వరకు ఫెయిల్యూర్ ని సక్సెస్ గా మలచుకోవడం సాధ్యమే.. కావాలంటే నేను గతంలో విడుదల చేసిన ఈ వీడియో చూడండి అంటూ ఆయన ఆ వీడియో రిలీజ్ చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీ, సేన, కాంగ్రెస్ పార్టీలు చివరివరకు గట్టి ప్రయత్నాలు చేశాయి. కానీ… హఠాత్తుగా బీజేపీ నేత దేవేంద్ర […]

' కబడ్డీ ' లాంటిదే ' మహా ' పాలిటిక్స్ కూడా.. ఆనంద్ మహీంద్రా వీడియో .. వావ్ !
Follow us
Anil kumar poka

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 1:56 PM

మహారాష్ట్రలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ‘ కబడ్డీ ‘ ఆటతో పోల్చారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ చివరి క్షణం వరకు ఫెయిల్యూర్ ని సక్సెస్ గా మలచుకోవడం సాధ్యమే.. కావాలంటే నేను గతంలో విడుదల చేసిన ఈ వీడియో చూడండి అంటూ ఆయన ఆ వీడియో రిలీజ్ చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీ, సేన, కాంగ్రెస్ పార్టీలు చివరివరకు గట్టి ప్రయత్నాలు చేశాయి. కానీ… హఠాత్తుగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఓ కబడ్డీ గేమ్ లో ‘ రైడర్ ‘ ని, ‘ డిఫెండర్ ‘ ఎలా చాకచక్యంగా పట్టేస్తాడో.. అతడి జట్టులోని ఇతర ప్లేయర్లు దూసుకు వచ్చి .. ఆ రైడర్ని లైన్ లోపలే ఎలా చుట్టుముట్టేసి అతడి ఆట కట్టిస్తారో చూడండి అంటూ ఆ వీడియోను పోస్ట్ చేశాడాయన.. ఇది తన ఓల్డ్ వీడియో అని, ‘ మహా ‘ రాజకీయాలు చూస్తుంటే తనకు ఇదే గుర్తుకు వచ్చిందని ఆయన అన్నారు. మరి.. మనం కూడా నమ్మవలసిందే !