‘ మహా ‘ రాజకీయాలపై ‘ సుప్రీం ‘ అసంతృప్తి.. .. ఫడ్నవీస్, అజిత్‌లకు నోటీసులు

మహారాష్ట్రలోని తాజా రాజకీయాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని ప్రకటించింది. ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ కు, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ కు నోటీసులు జారీ చేసింది. తనకు మెజారిటీ ఉందని, అందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా తనను గవర్నర్ ఆహ్వానించాలని ఫడ్నవీస్ ఇఛ్చిన లేఖలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలో గవర్నర్ తో బాటు బీజేపీ వ్యవహరించిన తీరును సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ దాఖలు చేసిన […]

' మహా ' రాజకీయాలపై ' సుప్రీం ' అసంతృప్తి..  .. ఫడ్నవీస్, అజిత్‌లకు నోటీసులు
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 1:54 PM

మహారాష్ట్రలోని తాజా రాజకీయాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని ప్రకటించింది. ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ కు, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ కు నోటీసులు జారీ చేసింది. తనకు మెజారిటీ ఉందని, అందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా తనను గవర్నర్ ఆహ్వానించాలని ఫడ్నవీస్ ఇఛ్చిన లేఖలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలో గవర్నర్ తో బాటు బీజేపీ వ్యవహరించిన తీరును సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్ పై ఆదివారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం లోని ముగ్గురు సభ్యుల బెంచ్ విచారణ జరిపింది. ఫడ్నవీస్, అజిత్ పవార్ తో బాటు కేంద్రానికి, రాష్ట్రానికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. రేపు (సోమవారం) ఉదయం 10. 30 గంటల కల్లా బీజేపీ.. గవర్నర్ కు ఇఛ్చిన మద్దతు లేఖలను అందించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఆ లేఖల తరువాత బల పరీక్షపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

కర్ణాటకలో జరిగినట్టు 24 గంటల్లోగా మహారాష్ట్ర అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవలసిందిగా బీజేపీని ఆదేశించాలని సేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. కోర్టును కోరాయి. దీనిపై స్పందించిన కోర్టు.. మొదట లేఖల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. గవర్నర్ నిర్ణయం జ్యూడిషియల్ పరిధిలోకి రాదని బీజేపీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. రాజ్యాంగం లోని 361 అధికరణం ప్రకారం గవర్నర్ ఇందుకు అతీతులని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, సేన తరపు వాదించిన కపిల్ సిబాల్.. దీన్ని వ్యతిరేకించారు. గవర్నర్ చర్య విద్రోహకరమని , అసలు గవర్నర్ ఎలాంటి సమాచారాన్నీ కోరలేదని, కర్ణాటకలో మాదిరి ఇరవై నాలుగు గంటల్లోగా బలాన్ని నిరూపించుకోవలసిందిగా బీజేపీని ఆదేశించాలని సింఘ్వీ కోరారు. 2014 లో కర్ణాటకలో విశ్వాస పరీక్షకు ఆదేశించిన సందర్భంలో నాడు బీజేపీ నేత ఎదియూరప్ప (తను సీఎంగా ప్రమాణం చేశాక) తనకు మెజారిటీ లేదంటూ తప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.