Tarun Chugh: ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధి: బీజేపీ నేత తరుణ్ చుగ్
Tarun Chugh: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించింది. తిరంగా ర్యాలీలు
Tarun Chugh: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించింది. తిరంగా ర్యాలీలు నిర్వహించడంతోపాటు.. నాయకులు జాతీయ జెండాలను సైతం ఆవిష్కరించారు. దీనిలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, జమ్మూ కాశ్మీర్ ఇంచార్జ్ తరుణ్ చుగ్ గురువారం శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. కాశ్మీర్‌కు ఇది చారిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు. కాశ్మీర్ విభజన పేరుతో ముఫ్తీ, అబ్దుల్లా కుటుంబాలు ఇంతకాలం దోచుకుంటున్నాయంటూ ఆయన ఆరోపించారు. వారి వల్లే కాశ్మీర్‌లో అభివృద్ధి నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. వేర్పాటువాదులు, తీవ్రవాద శక్తులు ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 తర్వాతే ఈ ప్రాంతంలో అభివృద్ధి, పురోగతి వాతావరణం కనిపిస్తుందన్నారు. దీంతోపాటు ప్రజలలో సైతం అభివృద్ధి కాంక్ష చిగురించిందని.. అందరూ ఇలాంటి వాతవరణాన్నే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఆర్టికల్ 370 చట్టాన్ని మళ్లీ పున:రుద్ధరించాలని ఏర్పడిన గుప్కార్ కూటమిపై తరుణ్ చుగ్ విరుచుకుపడ్డారు. అది గుప్కార్ గ్యాంగ్ అంటూ విమర్శించారు.
आज ही के दिन PM श्री @NarendraModi जी व गृह मंत्री श्री @AmitShah जी की अगुवाई में जम्मू कश्मीर में धारा 370 को निरस्त कर यहां पर एक नए युग का निर्माण हुआ। इस शुभ अवसर पर जम्मू कश्मीर के भाजपा कार्यकर्ताओं, पदाधिकारियों एवं स्थानीय लोगों के साथ जश्न मनाते हुए।#NewJammuKashmir pic.twitter.com/k31uULr6Hl
— Tarun Chugh (@tarunchughbjp) August 5, 2021
దశాబ్దాల పాటు ఈ ప్రాంత ప్రజలు.. పాకిస్తాన్ ఉగ్రవాదంతో విసిగిపోయారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారంటూ తెలిపారు. ఇంతకాలం ఇక్కడి ప్రజలలో ఉన్న దేశ వ్యతిరేక భావనలు తొలగిపోయాయని.. ప్రస్తుతం అభివృద్ధి, పురోగతి ఆలోచనలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి ఆరోగ్యం, విద్యా, మౌలిక సదుపాయాల కల్పన గణనీయంగా మెరుగుపడిందని తరుణ్ చుగ్ పేర్కొన్నారు.
Also Read: