AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 నెలల చిన్నారికి వారం రోజులుగా ఆగని వాంతులు..ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌..!

14 నెలల బాలిక అన్నవాహికలో అర అంగుళం వెడల్పు గల మెటల్ స్ప్రింగ్ ఇరుక్కుని ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. తీవ్ర వాంతులతో బాధపడుతున్న చిన్నారిని యమునానగర్ నుండి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్ పీడియాట్రిక్ సర్జన్లు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, ప్రమాదకరమైన స్ప్రింగ్‌ను తొలగించి బాలిక ప్రాణాలను కాపాడారు. పిల్లలను చిన్న వస్తువుల నుండి దూరంగా ఉంచాలని డాక్టర్లు తల్లిదండ్రులకు సూచించారు.

14 నెలల చిన్నారికి వారం రోజులుగా ఆగని వాంతులు..ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌..!
Aiims Doctors Save Baby
Jyothi Gadda
|

Updated on: Feb 08, 2026 | 9:46 PM

Share

14 నెలల బాలిక గొంతులో అర అంగుళం వెడల్పు గల స్ప్రింగ్ ఇరుక్కుపోయింది. దాంతో ఆ శిశువు ఎంత దారుణమైన పరిస్థితి ఎదురవుతుందో ఊహించుకోండి. ఆమె ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కానీ, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు చిన్నారికి విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. ఒక పెద్ద మెటల్ స్ప్రింగ్ ఆమె అన్నవాహికలో ఇరుక్కుపోయి ఆమె ప్రాణాలకే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. యమునానగర్‌కు చెందిన ఒక పసికందు వారం రోజులుగా నిరంతరం వాంతులు చేసుకుంటోంది. పసికందుకు ఏం జరిగిందో తల్లిదండ్రులు అర్థం కాలేదు. రెండు రోజులుగా తినడం, తాగడం మానేసింది. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇక లాభం లేదని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

పాపను పరీక్షించిన వైద్యులు ఎక్స్-రే తీయించగా పసికందు అన్నవాహిక పైభాగంలో పెద్ద మెటల్ స్ప్రింగ్ ఉందని గుర్తించారు. ఎండోస్కోపీని ఉపయోగించి స్ప్రింగ్‌ను తొలగించడానికి ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకపోయింది. చిన్నారి శరీరం లోపల ట్యూబ్ లోతుగా ఇరుక్కుపోయి ఉందని, దాని చుట్టూ వాపు, గాయం ఉందని, అది పగిలిపోయే ప్రమాదం ఉందని చిన్నారి తల్లిదండ్రులకు వివరించారు వైద్యులు. వెంటనే ఆమెను ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ ఆమెకు విజయవంతమైన ఆపరేషన్ జరిగింది.

ఢిల్లీ ఎయిమ్స్‌లోని పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ విశేష్ జైన్ మాట్లాడుతూ, ఈ కేసు చాలా తీవ్రమైనదని అన్నారు. స్ప్రింగ్ అన్నవాహిక పైభాగంలో ఇరుక్కుపోయి చాలా మందంగా ఉంది. ఇది సాధారణ స్ప్రింగ్ కంటే చాలా భిన్నంగా ఉంది. ఇది అర అంగుళం వెడల్పు, ఒకటిన్నర నుండి రెండు అంగుళాల పొడవు ఉందని గుర్తించారు.. ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే పాపకు ఆపరేషన్ చేసినట్టుగా చెప్పారు. ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉంది. ఆహారం తీసుకుంటోంది. బాలికకు రెండుసార్లు ఎండోస్కోపిక్ పరీక్షలు నిర్వహించామని, ఆమె అన్నవాహిక దెబ్బతిన్నట్లు చెప్పారు. చాలా వాపు, కొంత రక్తస్రావం ఉన్నందున టెలిస్కోప్ ద్వారా కూడా చూడటం కష్టమవుతుందని అన్నారు. కానీ, ఎంతో ఓపిక, అతి కష్టం మీద సర్జరీ విజయవంతంగా పూర్తి చేసిన పాప ప్రాణాలను కాపాడామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ విశేష్ జైన్ అన్నారు. స్ప్రింగ్‌లు, నాణేలు, బ్యాటరీలు లేదా చిన్న బొమ్మల భాగాలు వంటి వస్తువులను వారికి దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే, పిల్లలు వాటిని నోట్లో పెట్టుకుంటారు..ఎప్పుడు మింగేస్తారో వారికి తెలియదు. ఒక చిన్న పిల్లవాడు అకస్మాత్తుగా వాంతులు చేసుకుంటే, తినడానికి లేదా తాగడానికి ఇబ్బంది పడుతుంటే..లేదా విపరీతంగా లాలాజలం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us