Obscene Music Bans: పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో బూతు పాటలు.. ప్లేచేస్తే అంతే సంగతులు..
పబ్లిక్ ట్రాన్స్పోర్టులలో బూతు పాటలను ప్లే చేస్తున్నారా ? అయితే జాగ్రత్త.. ఒకవేళ అలా కనుగ చేస్తే మీ వాహనాల పని అంతే ఇక. మీ బండి లైసెన్స్ రద్దు చేయడమే
పబ్లిక్ ట్రాన్స్పోర్టులలో బూతు పాటలను ప్లే చేస్తున్నారా ? అయితే జాగ్రత్త.. ఒకవేళ అలా కనుగ చేస్తే మీ వాహనాల పని అంతే ఇక. మీ బండి లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. హోళీ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రజా రవాణాలో అశ్లీల పాటలను ప్లే చేయడం గానీ, పాడడం వంటివి చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వూలను విడుదల చేసింది.
జూలై 6, 2018న జరిగిన రాష్ట్ర రవాణా అథారిటీ సమావేశం ట్రక్కులు, బస్సులు, టెంపోలు, ఇతర పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో అసభ్యకరమైన పాటలు పాడటానికి పరిమితి విధించిన విషయాన్ని మళ్లీ లేవనెత్తింది. ఇక మీదట ప్రజారావాణా వాహనాల్లో అశ్లీల పాటలు వినిపించకూడదని.. నిబంధనలు పాటించకపోతే వాహన అనుమతులను రద్దు చేయడంతోపాటు మరిన్ని కఠనమైన నిర్ణయాలు తీసుకుంటామని నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం జిల్లా రవాణా అధికారులకు ఉత్తర్వూలు జారీ చేసింది. హోళీ పండగను దృష్టిలో పెట్టుకోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో పండగ సమయంలో వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని.. అశ్లీల సంగీతాన్ని ప్రదర్శించకుండా మరింత నిఘా పెంచాలని రవాణా శాఖా జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాఠశాలలు, కళాశాల క్యాంపస్‌లతోపాటు నివాస ప్రాంతాలకు దగ్గర్లో ఇలాంటి సంగీతాన్ని ఆరికట్టడానికి జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు.
నిబంధనలను కఠినంగా పాటించేలా, అన్ని ట్రాఫిక్ ఎస్పీలు, జాయింట్ కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అథారిటీ, అన్ని జిల్లాల రవాణా అధికారులు ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణాలో భోజ్‌పూరి పాటలను ప్లే చేసే ధోరణి వల్ల కలిగే శబ్ద కాలుష్యం యొక్క ప్రభావాలను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అంతేకాక సంగీతం కంటెంట్ కారణంగా కొంతమంది ‘అసౌకర్యంగా’ భావిస్తున్నందున, అసభ్యకరమైన సంగీతాన్ని ప్లేచేయకుండా చర్యలు చేపడుతూ.. ప్రజలకు శాంతియుత పండగ వాతావరణాన్ని కలిగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read:
బంగారం పై పెట్టుబడులు పెడుతున్నారా ? అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..