చదువు ఫస్ట్.. ‘సైక్లింగ్ ఫెడరేషన్‌’ ఆఫర్‌పై స్పందించిన జ్యోతి..!

జ్యోతి కుమారి.. బీహార్‌లోని సిర్‌హుల్లీకి చెందిన ఈ 15 ఏళ్ల బాలికపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యాక్సిడెంట్‌కు గురైన తన తండ్రిని

చదువు ఫస్ట్.. 'సైక్లింగ్ ఫెడరేషన్‌' ఆఫర్‌పై స్పందించిన జ్యోతి..!
Follow us

| Edited By:

Updated on: May 25, 2020 | 2:07 PM

జ్యోతి కుమారి.. బీహార్‌లోని సిర్‌హుల్లీకి చెందిన ఈ 15 ఏళ్ల బాలికపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యాక్సిడెంట్‌కు గురైన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని 1200కు పైగా కిలోమీటర్లు ప్రయాణించి తమ స్వగ్రామానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఖ్యాతి ఖండాతరాలుగా వ్యాపించింది. ఇవాంకా ట్రంప్‌ సైతం సోషల్ మీడియాలో జ్యోతిపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే జ్యోతి సాహసాన్ని గుర్తించిన సైక్లింగ్ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా ఆ అమ్మాయికి బంపరాఫర్ ఇచ్చింది. సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఆహ్వానించడంతో పాటు ఉచితంగా శిక్షణ ఇస్తామని తెలిపింది.

అయితే సైక్లింగ్ ఫెడరేషన్‌ ఇచ్చిన ఆఫర్‌ను జ్యోతి సున్నితంగా పక్కకు పెట్టింది. దీనికి సంబంధించిన ఆమె బలమైన కారణం కూడా చెప్పుకొచ్చింది. ‘నేను ముందు నా చదువును పూర్తి చేయాలి. అందులోనూ ఆ ప్రయాణం తరువాత నేను చాలా వీక్‌గా అయిపోయా’ అని తెలిపింది. ‘ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా నా చదువును కొనసాగించలేకపోయా. కానీ ఇప్పుడు నా పదోతరగతిని పూర్తి చేయాలనుకుంటున్నా’ అని జ్యోతి పేర్కొంది. ఇక ఈ విషయం తెలిసిన లోక్‌ జనశక్తి పార్టీ ప్రెసిడెంట్‌.. జ్యోతి చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు.

మరోవైపు సైక్లింగ్ ఫెడరేషన్‌ ఆఫర్‌పై మాట్లాడిన జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్‌.. ”లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత జ్యోతిని ట్రయల్స్ కోసం పంపుతాము. నిన్ననే తొమ్మిదో తరగతిలో చేరేందుకు ఆమె పేరును నమోదు చేసుకుంది. ఇప్పుడైతే జ్యోతి మెట్రిక్యులేషన్‌ పూర్తి చేయాలని కోరుకుంటున్నాము” అని పేర్కొన్నారు. కాగా పిందరూచ్‌ హైస్కూల్‌లో తొమ్మిది తరగతి కోసం ఆమె పేరును జిల్లా మెజిస్ట్రేట్ నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఓ కొత్త సైకిల్, స్కూల్ యూనిఫామ్, షూస్‌ను జ్యోతికి ఇచ్చారు.

Read This Story Also: మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో విబేధాలు.. ఆగిన రవితేజ మూవీ..!

Latest Articles
రచ్చ లేపిన రాశిఖన్నా.. చక్కనమ్మ చిక్కినా అందమే
రచ్చ లేపిన రాశిఖన్నా.. చక్కనమ్మ చిక్కినా అందమే
చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ అంగీకారం అందుకే.. మోదీ కీలక వ్యాఖ్యలు
చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ అంగీకారం అందుకే.. మోదీ కీలక వ్యాఖ్యలు
అమ్మబాబోయ్..!! ఇది మాములు మేకోవర్ కాదు..
అమ్మబాబోయ్..!! ఇది మాములు మేకోవర్ కాదు..
అదే బాలాసాహెబ్ ఠాక్రేకు నేనిచ్చే నివాళి.. ప్రధాని మోదీ భావోద్వేగం
అదే బాలాసాహెబ్ ఠాక్రేకు నేనిచ్చే నివాళి.. ప్రధాని మోదీ భావోద్వేగం
నిమ్మ, టొమాటో, కొబ్బరి నూనెతో చెమట వాసనకు గుడ్‌బై చెప్పండి
నిమ్మ, టొమాటో, కొబ్బరి నూనెతో చెమట వాసనకు గుడ్‌బై చెప్పండి
మేక వన్నే పులి ఈ మాయ.. అసలు, నకిలీ పుచ్చకాయలను ఇలా గుర్తించండి
మేక వన్నే పులి ఈ మాయ.. అసలు, నకిలీ పుచ్చకాయలను ఇలా గుర్తించండి
T20 ప్రపంచకప్‌కు సెలెక్ట్ అవుతాడని ముందే మిఠాయిలు, పటాకులు.. కానీ
T20 ప్రపంచకప్‌కు సెలెక్ట్ అవుతాడని ముందే మిఠాయిలు, పటాకులు.. కానీ
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
వేసవిలో ఫ్రిజ్‌ నీళ్లు తాగితే హార్ట్‌ ఎటాక్‌ వస్తుందా?
వేసవిలో ఫ్రిజ్‌ నీళ్లు తాగితే హార్ట్‌ ఎటాక్‌ వస్తుందా?
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే