బీహార్ ఎన్నికల్లో మాజీ డీజీపీపై శివసేన అభ్యర్థి పోటీ ?
బీహార్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండేపై తమ అభ్యర్థిని నిలబెడతామని శివసేన ప్రకటించింది. సుశాంత్ కేసు దర్యాప్తులో ముంబై పోలీసుల తీరును లోగడ పాండే తీవ్రంగా..
బీహార్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండేపై తమ అభ్యర్థిని నిలబెడతామని శివసేన ప్రకటించింది. సుశాంత్ కేసు దర్యాప్తులో ముంబై పోలీసుల తీరును లోగడ పాండే తీవ్రంగా విమర్శించారు. ఇటీవల ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ సమక్షంలో పాలక జేడీ-యూ లో చేరారు. అయితే పాండే రాజకీయ ప్రయోజనాలకోసమే సుశాంత్ కేసును వాడుకున్నారని శివసేన నేత అనిల్ దేశాయ్ ఆరోపించారు. బీహార్ లో బక్సర్ నియోజకవర్గం నుంచి పాండే పోటీ చేయనున్నారని, ఆయనపై తమ పార్టీ అభ్యర్థిని నిలబెడతామని అనిల్ అన్నారు. బీహార్ ఎన్నికల్లో శివసేన సుమారు 50 సీట్లకు పోటీ చేయనుంది.