తొలి జాబితాను ప్రకటించిన జేడీయూ

ప్రతిపక్ష పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన అధికార జేడీ(యూ) బుధవారం 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

తొలి జాబితాను ప్రకటించిన జేడీయూ
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 07, 2020 | 6:47 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాల్లో జోరందుకుంది. ప్రతిపక్ష పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన అధికార జేడీ(యూ) బుధవారం 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే బీజీపీ తమ తొలి జాబితాను విడుదల చేసి ప్రచారంలో ముందు వరుసలో ఉండగా, తాజాగా జేడీయూ అభ్యర్థలను ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని దూసుకుపోతుంది.

పార్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చంద్రికా రాయ్, చెనారి నుంచి లాలన్ పాశ్వాన్, రూపౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీమా భారతి బరిలోకి దిగుతున్నారు. తొలుత 25 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను జేడీ(యూ) సోమవారం విడుదల చేసింది. అయితే, దానిని సవరించి బుధవారం కొత్త జాబితాను ఖరారు చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్డీయే కూటమికి చెందిన జేడీ(యూ) 122, బీజేపీ 121 స్థానాల్లో పోటీ చేయాలని సంధి కుదుర్చుకున్నాయి. అయితే అభ్యర్థుల ఖరారులో జేడీ(యూ) ముందు ఉండగా, బీజేపీ ఇప్పటి వరకు 27 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మరోవైపు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన ఎల్జేపీ ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తోంది. కాగా, 71 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ 28న జరుగనున్న తొలి విడుత పోలింగ్‌ కోసం నామినేషన్‌ దాఖలుకు గురువారం చివరి రోజు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఖరారులో అన్ని పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి.