ఓ నిండు ప్రాణాన్నిబలితీసుకున్న అక్రమ సంబంధం

తమిళనాడులో దారుణం జరిగింది. అందరు చూస్తుండగానే ఓ వ్యక్తిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు.

ఓ నిండు ప్రాణాన్నిబలితీసుకున్న అక్రమ సంబంధం
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 07, 2020 | 6:31 PM

తమిళనాడులో దారుణం జరిగింది. అందరు చూస్తుండగానే ఓ వ్యక్తిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. స్థానిక సలవన్‌పేట కచ్చేరి వీధికి చెందిన గోపి (38) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడాది క్రితం ఆమెతో బెంగుళూరు వెళ్లిన గోపి అక్కడే కాపురం పెట్టేశాడు. ఇదిలావుంటే, గోపి బంధువుల చనిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సోమవారం రాత్రి గోపి వేలూరుకు వచ్చాడు. గోపి వచ్చాడన్న సమాచారం అందుకున్న శరవణన్ గోపిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. తన భార్యను తీసుకెళ్లాడన్న ఆగ్రహంతో శరవణన్‌ కత్తితో గోపిపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ గోపిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతను మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన వేలూరు పోలీసులు శరవణన్‌ను అరెస్ట్‌ చేశారు.