రెండు బైకులు ఢీకొని మామ, అల్లుళ్ల మృతి
సంగారెడ్డి జిల్లా విషాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని మామ, అల్లుళ్లు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం చిన్న కంజర్ల వద్ద చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా విషాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని మామ, అల్లుళ్లు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం చిన్న కంజర్ల వద్ద చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో పెద్దకంజర్ల గ్రామానికి చెందిన మంగలి రాములు(55), కుమార్(32) ఇద్దరు రోడ్డుపై పడటంతో తలకు బలంగా గాయాలయ్యాయి. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. బేగంపేటకి చెందిన మరో ఇద్దరు యువకులు వినోద్, జగదీష్‌కు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీరిద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.