Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రికి కరోనా.. సీపీఎం జాతీయ నేతలకూ పాజిటివ్..

Covid-19 Positive: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చూస్తుండగానే రోజూవారి కేసుల

Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రికి కరోనా.. సీపీఎం జాతీయ నేతలకూ పాజిటివ్..
Nitish Kumar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 10, 2022 | 7:23 PM

Covid-19 Positive: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చూస్తుండగానే రోజూవారి కేసుల సంఖ్య పదివేల నుంచి లక్షన్నర దాటింది. దీంతోపాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగుతోంది. ఈ క్రమంలో సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. సోమవారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి, సీపీఎం నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సీఎం ఆఫీస్ అధికారులు వెల్లడించారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ ఇంట్లోనే ఐసోలేట్ అయి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నారని వెల్లడించారు.

ఇదిలాఉంటే.. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, బృంద కారత్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఇద్దరు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ రాగా… వారిద్దరూ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

కాగా.. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 1,79,723 మందికి కోవిడ్ సోకింది. కరోనా వల్ల ఒక్కరోజు వ్యవధిలో మరో 146మంది మృతి చెందారు. 46,569 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో కోవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. Also Read:

Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కసరత్తు.. కోవిడ్ ప్రోటోకాల్స్‌తో..

Omicron Alert: థర్డ్ వేవ్‌లో ఆ అవసరం 5-10 శాతం మందికే.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..