బీహార్‌లో ఫైనల్ అయిన ఎన్డీయే కూటమి సీట్ల పంపిణీ
బీహార్ ఎన్నికల వేళ అధికార ఎన్డీయే కూటమి (జనతాదళ్ (యు), బీజేపీ) మధ్య సీట్ల పంపిణీ ఫైనల్ అయింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు గాను రాబోయే ఎన్నికలలో జేడీ(యూ) 122 స్థానాల్లో బరిలో నిలుస్తుంది. ఇక.. బీజేపీ 121 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. రాజధాని పాట్నాలో జరిగిన సంయుక్త పార్టీల విలేకరుల సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ (బీజేపీ) ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే […]

బీహార్ ఎన్నికల వేళ అధికార ఎన్డీయే కూటమి (జనతాదళ్ (యు), బీజేపీ) మధ్య సీట్ల పంపిణీ ఫైనల్ అయింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు గాను రాబోయే ఎన్నికలలో జేడీ(యూ) 122 స్థానాల్లో బరిలో నిలుస్తుంది. ఇక.. బీజేపీ 121 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. రాజధాని పాట్నాలో జరిగిన సంయుక్త పార్టీల విలేకరుల సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ (బీజేపీ) ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ కూటమిలో మరో రెండు పార్టీలూ ఉన్నాయి. అందులో ఒకటైన జీతన్ రామ్ మాంఝీ నేతృత్వం వహిస్తున్న హిందూస్తానీ అవాం మోర్చా (హెచ్ఏఎం) ఏడు సీట్లలో పోటీ చేయనుంది. దీనికి జేడీ(యూ) కు కేటాయించిన 122 సీట్ల నుంచి ఇవ్వాల్సి ఉంది. ఇక బీజేపీ.. తన 121 సీట్ల నుంచి వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (విఎస్ఐపీ)కి ఆరు సీట్లు కేటాయించనుంది. ఈ లెక్కన రాబోయే ఎన్నికల్లో జేడీ (యూ) సొంతంగా 115 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుండగా.. బీజేపీ 116 సీట్లలో పోటీ పడనుంది.



