హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలాకు కరోనా వైరస్ పాజిటివ్
హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలాకు కోవిడ్-19 పాజిటివ్ సోకింది. అయితే తను ఆరోగ్యంగా ఉన్నానని, పాజిటివ్ అని రిపోర్టు వఛ్చినా ఏ విధమైన జ్వరంగానీ..

హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలాకు కోవిడ్-19 పాజిటివ్ సోకింది. అయితే తను ఆరోగ్యంగా ఉన్నానని, పాజిటివ్ అని రిపోర్టు వఛ్చినా ఏ విధమైన జ్వరంగానీ, ఇతర రుగ్మతలు గానీ లేవని ఆయన ట్వీట్ చేశారు. గత వారం రోజులుగా తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని దుష్యంత్ సూచించారు. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానన్నారు. ఇటీవల రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా, మరికొందరు మంత్రులు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు.
सभी साथियों के लिए सूचना – मेरी Covid-19 की रिपोर्ट positive आई है। मेरा स्वास्थ्य ठीक है। आग्रह है कि बीते कुछ दिनों में मेरे संपर्क में आए लोग अपना ध्यान रखें और डॉक्टर सलाह दें तो टेस्ट करवाएं। pic.twitter.com/whuguUR3bp
— Dushyant Chautala (@Dchautala) October 6, 2020