Bhopal Constable: మీసాలు తీయనందుకు ఉద్యోగం నుంచి సస్పెండ్.. అయినా తగ్గేదేలే అంటోన్న కానిస్టేబుల్..
Bhopal Constable: ఉద్యోగుల వ్యవహార శైలికి సంబంధించి ఒక్కో సంస్థ ఒక్కో నియమనిబంధనలు పెడుతుంటాయి. మరీ ముఖ్యంగా ప్రైవేటు కంపెనీల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సహజంగా...
Bhopal Constable: ఉద్యోగుల వ్యవహార శైలికి సంబంధించి ఒక్కో సంస్థ ఒక్కో నియమనిబంధనలు పెడుతుంటాయి. మరీ ముఖ్యంగా ప్రైవేటు కంపెనీల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సహజంగా డ్రస్ కోడ్‌లాంటి విషయాలల్లో ఈ నిబంధనలు ఉంటాయి. అయితే తాజాగా మీసాలు తీసేయాలేదని ఏకంగా సస్పెండ్ చేశారు. అది కూడా ఒక కానిస్టేబుల్‌ను. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందనేగా..
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాకేశ్ రానా అనే ఓ వ్యక్తి వింగ్ కమాండర్ అభినందన్‌ను పోలిన విధంగా మీసాలను పెంచుకున్నాడు. అయితే అధికారులు మీసాలను కత్తిరించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే రాకేశ్ దీనికి నిరాకరించాడు. దీంతో నిబంధనలు పాటించలేదనే కారణంతో అధికారులు రాకేశ్‌ను సస్పెండ్‌ను చేశారు. ఈ విషయమై అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘రాకేశ్ మీసాలను మెడవరకూ పెంచాడు. మీసాలను తొలగించకపోతే ఆ ప్రభావం ఇతర సిబ్బందిపై కూడా పడే అవకాశం ఉంది. అందుకే అతనిని విధుల నుంచి సస్పెండ్ చేశాం’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే తనను సస్పెండ్ చేసినా తగ్గేది లేదని తేల్చి చెప్పారు రాకేశ్ రానా. తాను రాజ్‌పుత్ వంశం నుంచి వచ్చానని, మీసాలు ఉండడమే తమకు గర్వకారణమి తెలిపాడు. అందుకోసం సస్పెండ్ అయినా ఫర్వాలేదని, రాజీపడే ప్రసక్తేలేదని, మీసాలు తొలగించనని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Rashmika Mandanna: పుష్ప హిట్‌తో భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక!.. ఒక్కో సినిమాకు ఏకంగా..
Telangana Corona: దేశంలో థర్డ్‌వేవ్ ఉగ్రరూపం.. తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే?
Gadget Guru: వాట్సప్‌లో కొత్తగా రాబోతున్న సూపర్ ఫీచర్.. వీడియో