Good News: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఒకే రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో దేశమంతా తిరిగేయవచ్చు..!

వాహనదారులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తీసుకువచ్చింది.

Good News: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఒకే రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో దేశమంతా తిరిగేయవచ్చు..!
New Registration Mark For Free Vehicles Transfer
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 28, 2021 | 3:46 PM

Good News Vehicles Transfer: వాహనదారులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తీసుకువచ్చింది. వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తమ వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాల్సిన అవసరం లేకుండా ‘బీహెచ్‌’ (భారత్‌ రిజిస్ట్రేషన్‌) రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ విధానం కింద వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసే అవసరం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీలు, వివిధ సంస్థల ఉద్యోగులు ఈ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా సులువుగా వెళ్లేందుకు వీలుపడుతుందని పేర్కొంది. దీనివల్ల ఒక రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలోని వాహన యజమాని మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బదిలీ అయినపుడు తన వాహనానికి మరోసారి రిజిస్ట్రేషన్ చేయించవలసిన అవసరం ఉండదు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదలైంది.

ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చేయించిన వాహనాన్ని గరిష్ఠంగా 12 నెలల వరకు మాత్రమే వేరే రాష్ట్రంలో ఉపయోగించే వీలుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ కాలం పాటు అక్కడ వాహనం నడపాలంటే వాహనాన్ని ఆ గడువులోగా మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాలి. దీంతో చాలామంది ఉద్యోగులకు ఈ విషయంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం బీహెచ్‌ సిరీస్‌ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ నూతన విధానానికి సంబందించిన నోటిఫికేషన్‌ను రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. బీహెచ్ సిరీస్ క్రింద వాహనాల రిజిస్ట్రేషన్ విధానం ప్రయోజనాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులు పొందవచ్చు. నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలుగల కేంద్ర ప్రభుత్వ,రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్, ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు,ఆర్గనైజేషన్లలో పని చేసే ఉద్యోగులు ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.

ఇక, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య వ్యక్తిగత వాహనాలు స్వేచ్ఛగా సంచరించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్ ఉన్న వాహనం యజమాని ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి బదిలీ అయినపుడు, ఈ వాహనాన్ని కూడా తనతోపాటు తీసుకెళ్ళడానికి కొత్తగా మరోసారి రిజిస్ట్రేషన్ చేయించవలసిన అవసరం ఉండదు.

Read Also…  Hyderabad: రాజేంద్రనగర్‌లో రెండేళ్ల బాలుడి మిస్సింగ్ విషాదం.. చెరువులో మృతదేహం లభ్యం!

Vehicle Insurance: సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!