AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రాజేంద్రనగర్‌లో రెండేళ్ల బాలుడి మిస్సింగ్ విషాదం.. చెరువులో మృతదేహం లభ్యం!

హైదరాబాద్‌ మహానగరంలో శుక్రవారం తప్పిపోయిన బాలుడి ఘటన విషాదాంతం అయ్యింది.

Hyderabad: రాజేంద్రనగర్‌లో రెండేళ్ల బాలుడి మిస్సింగ్ విషాదం.. చెరువులో మృతదేహం లభ్యం!
Missing Boy Dead Body
Balaraju Goud
|

Updated on: Aug 28, 2021 | 3:23 PM

Share

 Missing Boy Dead Body Found: హైదరాబాద్‌ మహానగరంలో శుక్రవారం తప్పిపోయిన బాలుడి ఘటన విషాదాంతం అయ్యింది. నగర శివారులోని రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన బాబా నగర్ కాలనీలో ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. ఎమ్ డి అబ్దుర్ రహమాన్, ఇషరత్ తబస్సుంల కుమారుడు రెండేళ్ల అబు బాకర్ శుక్రవారం ఉదయం 11గంటల నుంచి కనిపించకుండాపోయాడు. దీంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు కుమారుడి కోసం రెండు రోజులుగా గాలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో తమ కొడుకు జాడకోసం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్ సాయంతో వెతికినప్పటికీ బాలుడి ఆచూకీ దొరకలేదు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, శనివారం ఉదయం సమీపంలోని చెరువులో చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అదృశ్యమైన బాలుడి డెడ్‌బాడీగా గుర్తించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

కాగా, విగతజీవిగా బాలుడిని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, చిన్నారిని హత్య చేసి చెరువులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ దారుణ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు  గల కారణాలపై విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Read Also….Auto Driver: పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ తన ఆటోను నడిరోడ్డులో దహనం చేసిన డ్రైవర్