AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vehicle Insurance: సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Vehicle Insurance: సెప్టెంబర్‌ 1 నుంచి కారు కొనుగోలు చేసేవారికి పలు నిబంధనలు మారనున్నాయి. తాజాగా మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచనలంగా మారింది. దీంతో వచ్చే..

Vehicle Insurance: సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
Subhash Goud
|

Updated on: Aug 28, 2021 | 3:44 PM

Share

Vehicle Insurance: సెప్టెంబర్‌ 1 నుంచి కారు కొనుగోలు చేసేవారికి పలు నిబంధనలు మారనున్నాయి. తాజాగా మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచనలంగా మారింది. దీంతో వచ్చే నెల 1 నుంచి విక్రయించే అన్ని కొత్త వాహనాలకు బంపర్‌ టు బంపర్‌ ప్రతిపాదికన వాహన యజమాని, డ్రైవర్లు, ప్రయాణికులందరినీ కలిపేలా ఐదు సంవత్సరాల పాటు బీమాను తప్పని సరి చేయాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. హొగినేకల్‌లో 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సడయప్పన్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. నష్టపరిమారం కోరుతూ కుటుంబ సభ్యులు ఈరోడ్‌ మోటారు ప్రమాద పరిహార ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. ట్రైబ్యునల్‌ సడయప్పన్‌ కుటుంబానికి రూ.14,65,000 నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీనిని వ్యతిరేకిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు న్యాయమూర్తి జస్టిస్‌ వైద్య నాథన్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. వాహన డ్రైవర్లు, యజమాని అనే ప్రాతిపదికన మాత్రమే వాహనానికి ఇన్సూరెన్స్‌ చేశారని, డ్రైవర్‌ కాని వ్యక్తి మృతి చెందితే లక్ష రూపాయలు చెల్లిస్తామని బీమా కంపెనీ తెలిపింది. సడయప్పన్‌ ప్రమాద సమయంలో వాహనం నడపలేదని పేర్కొంది. అంగీకరించిన న్యాయమూర్తి ఈరోడ్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలను రద్దు చేశారు. కోర్టు ఆదేశాలను బీమా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వ రవాణశాఖ అదనపు కార్యదర్శఙ తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.

సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత కొనుగోలు చేసే ప్రతీ వాహనానికి ప్రతీ ఏడాది బంపర్​-టూ-బంపర్​ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. అదనంగా ఇందులోనే డ్రైవర్, ప్యాసింజర్లు, వాహన యజమానికి ఐదేళ్ల ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలి అని జస్టిస్​వైద్యనాథన్ చెప్పారు.

ఇప్పటి వరకు బంపర్​-టూ-బంపర్ మోటార్ ఇన్సూరెన్స్​.. వాహనాల విడిభాగాలకు డ్యామేజీ అయితే కవరేజీని ఇస్తున్నాయి. ఇక కోర్టు ఆదేశాల ప్రకారం దీంట్లోనే వాహన యజమాని, డ్రైవర్, ప్యాసింజర్లకు కవర్ వర్తించాలనడంతో ప్రీమియంల ధరలు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలు యథాతథంగా కొనసాగితే ప్రీమియంలు ధరలు పెరుగుతాయని అంటున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఇన్సూరెన్స్ సంస్థలు ఓ కొత్త పాలసీని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త విధానం ఇన్సూరెన్స్ సంస్థలకు లాభించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం మోటార్ ఇన్సూరెన్స్​లతో మూడు విధానాలు ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఓన్ డ్యామేజీ పాలసీ, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీ పాలసీలు ఉన్నాయి. వాహనం కొన్న తొలి సంవత్సరం పర్సనల్​ యాక్సిడెంట్ పాలసీ తీసుకోవడం కచ్చితం కాగా.. రెండో సంవత్సరం నుంచి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి

Jan Dhan Yojana: జన్‌ ధన్‌ యోజన పథకానికి ఏడేళ్లు పూర్తి.. ఎంత మంది లబ్ది పొందారో తెలుసా..?

e-Shram Portal: వారి కోసం కేంద్రం అదిరిపోయే బెనిఫిట్.. ఈ కార్డుతో రూ.2 లక్షల వరకు ప్రయోజనం..!

New PF Rule: మీకు పీఎఫ్‌ ఖాతా ఉందా..? అయితే ఈ పని పూర్తి చేయండి.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు