Viral: పెళ్లై తొమ్మిది నెలలైనా జరగని ఫస్ట్ నైట్.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్.. భర్త ఏం చేశాడంటే..
బీహార్‌కు పృథ్వీ రాజ్ సింగ్ అనే ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ బెంగళూరులో నివాసముంటున్నాడు. జ్యోతి కుమారి అనే మహిళను తొమ్మిది నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు.
Bengaluru man kills wife: భార్య లైంగిక సంబంధానికి నిరాకరించిందని భర్త ఆమెను దారుణంగా చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని నదిలో పడేసి.. ఏం తెలియనట్లు కట్టుకథలు అల్లాడు. తన భార్య కనిపించకుండా పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు భర్త మీద అనుమానంతో పోలీసులు తమదైన స్టైల్‌లో ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో చోటుచేసుకుంది. బీహార్‌కు పృథ్వీ రాజ్ సింగ్ అనే ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ బెంగళూరులో నివాసముంటున్నాడు. జ్యోతి కుమారి అనే మహిళను తొమ్మిది నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో భార్య వయస్సు గురించి అబద్ధం చెప్పడం.. శారీరక సంబంధాన్ని పంచుకునేందుకు అంగీకరించపోవడంతో భర్త మరింత రగిలిపోయాడు. అనంతరం ఆమెను చంపి పృథ్వీ రాజ్ సింగ్ నాటకమాడినట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లి సమయంలో ఆమె వయస్సు 28 సంవత్సరాలు అని చెప్పిందని.. ఆమె తన కంటే 10 సంవత్సరాలు పెద్దదని నిందితుడు తెలిపాడు. అంతేకాకుండా పెళ్లైన నాటినుంచి సెక్స్‌కు అంగీకరించలేదని.. తన తల్లిదండ్రులను సైతం అవమానించడంతో నిందితుడు కోపం పెంచుకున్నాడు. అనంతరం సింగ్ తన భార్య జ్యోతిని చంపేందుకు బీహార్‌కు చెందిన తన స్నేహితుడు సమీర్ కుమార్‌ను పిలిపించాడు. ఆగష్టు 3న ఇద్దరూ ఉడిపికి వెళ్లారు. అక్కడ వారు జ్యోతిని గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని షిరాడీ ఘాట్ లో పడేశారు. మరుసటి రోజు జ్యోతి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. భర్త మీద అనుమానం రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం