Water Crisis: కారు కడిగినా, చెట్లకు నీళ్లు పెట్టినా.. రూ.5 వేలు జరిమానా.. ఉత్తర్వులు జారీ

బెంగళూరులో నీటి కొరత ఉన్నప్పటికీ, నగరంలోని కొన్ని హౌసింగ్ సొసైటీలలో నీటి దుర్వినియోగ కేసులు నమోదయ్యాయి. ఆపై అక్కడి నివాసితులకు రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. అయితే, ఇప్పుడు దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. 5 వేల జరిమానా విధిస్తున్నట్లు కర్ణాటక నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Water Crisis: కారు కడిగినా, చెట్లకు నీళ్లు పెట్టినా..  రూ.5 వేలు జరిమానా.. ఉత్తర్వులు జారీ
Water Crisis
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 08, 2024 | 11:05 AM

వేసవికి ముందే నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న కర్ణాటకలోని బెంగళూరు నగరంలో కొత్త ఆర్డర్ జారీ అయ్యింది. బెంగళూరులో ఎవరైనా కార్లు కడగడం, తోటపని చేయడం, నిర్మాణాలు చేపట్టడం, వాటర్ ఫౌంటెయిన్లను ఉపయోగించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కర్ణాటక నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వ్యక్తి రూ. 5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

బెంగళూరులో నీటి కొరత ఉన్నప్పటికీ, నగరంలోని కొన్ని హౌసింగ్ సొసైటీలలో నీటి దుర్వినియోగ కేసులు నమోదయ్యాయి. ఆపై అక్కడి నివాసితులకు రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. అయితే, ఇప్పుడు దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. 5 వేల జరిమానా విధిస్తున్నట్లు కర్ణాటక నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

గత ఏడాది తక్కువ వర్షపాతం, ఇప్పుడు పెరుగుతున్న వేసవి తాపం, కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రమైంది. ప్రతి నీటి చుక్కపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా హైటెక్ సిటీ బెంగళూరు నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఏకంగా ముఖ్యమంత్రి నివాసంలోనూ నీటి ఎద్దడి బట్టబయలయ్యే పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 5న ఇక్కడికి నీటి ట్యాంకర్లు వచ్చి వెళ్లడం కనిపించింది. అంతే కాకుండా ప్రతి నీటి చుక్కపై లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. సొసైటీలు, కాలనీల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా నీటి కొరత తీరడం లేదు. క్లిష్ట పరిస్థితుల్లో, పాఠశాలలు మూసివేశారు. కోచింగ్ సెంటర్‌లు కూడా ఎమర్జెన్సీని ప్రకటించాయి. విద్యార్థులు వర్చువల్‌గా తరగతులు తీసుకోవాలని కోరారు.

రాజధానిలోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసానికి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితి నెలకొంది. అయితే, త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. 2023లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు సహా కర్ణాటకలో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. నగర వీధుల్లో నీటి ట్యాంకర్లు నడుస్తున్నాయి. నీటి సమస్యతో సాధారణ రోజుల్లో రూ.700 నుంచి 800 వరకు లభించే నీటి ట్యాంకర్ల ధర రూ.1500 నుంచి రూ.1800కి చేరింది. సంకి సరస్సు సమీపంలోని సదాశివనగర్‌లోని తన నివాసంలో తొలిసారిగా బోరుబావి ఎండిపోయిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు.

పెరుగుతున్న సంక్షోభం మధ్య, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీటి ట్యాంకర్ యజమానులకు మార్చి 7 గడువులోగా అధికారులతో నమోదు చేయకపోతే వారి ట్యాంకర్లను జప్తు చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. బెంగళూరులోని బృహత్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. బెంగళూరు నగరంలో మొత్తం 3,500 వాటర్ ట్యాంకర్లలో కేవలం 10 శాతం, అంటే 219 ట్యాంకర్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. గడువులోగా నమోదు చేసుకోకుంటే వాటిని జప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో నీటి అవసరాలు తీర్చేందుకు ప్రైవేట్ ట్యాంకర్లు, ప్రైవేట్ బోర్‌వెల్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన ప్రకటించారు. పాల ట్యాంకర్ల నుంచి కూడా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఒక్కో ట్యాంకర్‌ నీటికి రేటు నిర్ణయించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ఇందుకోసం తాలూకా స్థాయిలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా జారీ చేయాలని నిర్ణయించారు.

బెంగళూరులో నీటి ఎద్దడిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.556 కోట్లు కేటాయించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా వెల్లడించారు. ‘బెంగళూరు నగరంలోని ఒక్కో ఎమ్మెల్యేకు వారి వారి నియోజకవర్గాల్లో నీటి కొరతను అధిగమించేందుకు రూ.10 కోట్లు ఇచ్చాం. అదనంగా, సమస్యను పరిష్కరించడానికి BBMP రూ. 148 కోట్లు, BWSSB రూ. 128 కోట్లు కేటాయించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వార్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. బెంగళూరులో నీటిని నిల్వ చేసేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్)కి చెందిన ఖాళీ పాల ట్యాంకర్లను వినియోగించనున్నారు. వినియోగంలో లేని పాల ట్యాంకర్లను నీటి సరఫరాకు వినియోగించాలని నిర్ణయించామన్నారు డీకే శివకుమార్. ఖాళీగా ఉన్న ట్యాంకర్లను వినియోగించి శుభ్రం చేసి వినియోగిస్తామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?