Cyber Crime: ఒకే‌ రూమ్‌లో 500మంది సైబర్ నేరగాళ్లకు ట్రైనింగ్.. వీడియో చూసి కంగుతిన్న పోలీసులు

రాజస్థాన్ లో అచ్చం జాంతారా సినిమా తలపిస్తోంది. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ఒకవైపు పోలీసులు అష్ట కష్టాలు పడుతుంటే, కొంతమంది కేటుగాళ్లు మాత్రం సైబర్ నేరాలకు పాల్పడినందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఒక ప్రాంతంలో ఏకంగా 500 మంది సైబర్ నేరగాళ్లు ఒకచోట చేరి శిక్షణ తీసుకుంటున్నట్టు ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు.

Cyber Crime: ఒకే‌ రూమ్‌లో 500మంది సైబర్ నేరగాళ్లకు ట్రైనింగ్.. వీడియో చూసి కంగుతిన్న పోలీసులు
Cyber Crime
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Balaraju Goud

Updated on: Mar 08, 2024 | 12:22 PM

రాజస్థాన్ లో అచ్చం జాంతారా సినిమా తలపిస్తోంది. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ఒకవైపు పోలీసులు అష్ట కష్టాలు పడుతుంటే, కొంతమంది కేటుగాళ్లు మాత్రం సైబర్ నేరాలకు పాల్పడినందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఒక ప్రాంతంలో ఏకంగా 500 మంది సైబర్ నేరగాళ్లు ఒకచోట చేరి శిక్షణ తీసుకుంటున్నట్టు ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు.

కొన్ని రోజుల క్రితం ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ పేరుతో వచ్చిన ఒక ఫిర్యాదును రాజస్థానీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో దయారామ్ మీనా అనే 19 సంవత్సరాల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష రూపాయల మోసానికి పాల్పడిన ఈ కేసులో ఆ యువకుడిని కస్టడీకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. రాజస్థాన్‌లోని రెండు జిల్లాలలో ఉన్న యువకులు సైబర్ నేరాలపై శిక్షణ తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. బుండీ, సవాయి ప్రాంతాలకు చెందిన యువకులు మొత్తం 500 మంది వరకు చేరి ఒక నిర్వహణకుడి దగ్గర శిక్షణ తీసుకుంటున్నట్లు గుర్తించారు.

రాజస్థాన్‌లో బీఏ చదువుతున్న విద్యార్థి యోగేష్ మీనా అనే 21 సంవత్సరాల యువకుడు ఈ మొత్తం శిక్షణ ఇస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మూడు గ్రామాలకు చెందిన యువకులకు సైబర్ నేరాలపై శిక్షణ ఇచ్చి వీరిని టెలికాలర్లుగా మాట్లాడించి, సైబర్ నేరాలు చేయిస్తున్నట్లు తేలింది. ప్రతిరోజు ఒక గంట పాటు వీరికి యోగేష్ శిక్షణ ఇస్తున్నాడు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులో దయారామ్‌తోపాటు యోగేష్, మరో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలురు సైతం సైబర్ నేరాలపై శిక్షణ తరగతులకు హాజరవుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలకు సూత్రధారులను రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. అయితే వీరు కాజేస్తున్న డబ్బు మొత్తాన్ని వెంటనే ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నట్టు దర్యాప్తులో బయటపడింది. పోలీసులు వీరి నివాసాల్లో సోదాలు చేసిన తరుణంలోనూ పెద్దగా డబ్బులు దొరకలేదు. ఒక గోల్డ్ రింగ్ తోపాటు 85 వేల రూపాయలను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. వీరు దేశవ్యాప్తంగా 100కు పైగా సైబర్ నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో బయటపడింది. అయితే వీరిని కస్టడికి తీసుకుని రాజస్థాన్ పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…