BEL Recruitment 2023: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 205 ఇంజనీర్‌ ఉద్యోగాలు..

|

Jun 14, 2023 | 8:32 PM

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌).. ఒప్పంద ప్రాతిపదికన 205 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

BEL Recruitment 2023: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 205 ఇంజనీర్‌ ఉద్యోగాలు..
BEL Bengaluru
Follow us on

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌).. ఒప్పంద ప్రాతిపదికన 205 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులు 191, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు 14 వరకు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ బీఎస్సీ/ బీఈ/బీటెక్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకు వయసు 28 ఏళ్లకు మించకూడదు. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు వయసు 32 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్‌ 24, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు.. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకైతే రూ.472, ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకైతే రూ.177 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో ఏడాది రూ.45,000, మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది రూ.55,000ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.