Karnataka New CM: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై.. కాసేపట్లో అధికారికంగా ఖరారు..?

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Jul 27, 2021 | 9:47 PM

Karnataka New Chief Minister: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామాతో తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై పేరును ఖరారు చేశారు.

Karnataka New CM: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై.. కాసేపట్లో అధికారికంగా ఖరారు..?
Karnataka Cm Baswaraj Bommai

Follow us on

Karnataka New Chief Minister Baswaraj Bommai: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఖారారు అయ్యారు. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడు. బీజేపీ కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ రాష్ట్ర ప్రస్తుత హోంమంత్రి బసవరాజ్ బొమ్మై ఎన్నికయ్యారు. దీంతో ఆయన కర్ణాటక తదుపరి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ రోజు కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన బీజేపీ అధిష్టానం ప్రతినిధులు, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డి.. ఈ అంశంపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉన్న బసవరాజ్ బొమ్మైను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు.

బెంగళూరులో బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన్ను సీఎంగా ఎన్నుకున్నారు. అధిష్టాన పరిశీలకులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు. సీఎం రేసులో కర్ణాటక హోం మంత్రి బసవరాజు బొమ్మై, అరవింద్ బెల్లాడ్, సీటీ రవి ఉన్నారని ప్రచారం జరిగినా చివరకు బసవరాజు బొమ్మైనే బలపరిచారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా బొమ్మై పేరునే సూచించారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం గురువారం ఉండే అవకాశముంది.

కాగా, కర్నాటక కేబినెట్‌లో భారీగా మార్పులు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రులుగా గోవింద్ కర్జోల్, ఆర్ అశోక, శ్రీరాములు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరులోని రాజ్ భవన్ గవర్నర్ సమక్షంలో కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read Also…  AP Debts: ఏపీ సర్కార్ అప్పులపై పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన.. ఎలాంటి మదింపు చేయలేదని స్పష్టం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu