Bangladesh MP Anwarul Azim: బంగ్లాదేశ్ ఎంపీ హత్య వెనుక ‘హనీట్రాప్’.. ప్రధాన సూత్రదారి ప్రియురాలు అరెస్ట్!
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ హత్యకేసులో కిలాడీ లేడీని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు యువతి ఈ హత్యకు కీలకంగా వ్యవహరించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకేసులో ప్రధాన సూత్రధారి అఖ్తరుజ్జమాన్‌కు ప్రియురాలు శిలాస్తీ రెహమాన్‌గా గుర్తించారు. ఎంపీ అన్వరుల్ హత్యకు ఆమెను 'హనీట్రాప్'గా వినియోగించినట్లు..
ఢాకా, మే 24: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ హత్యకేసులో కిలాడీ లేడీని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు యువతి ఈ హత్యకు కీలకంగా వ్యవహరించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకేసులో ప్రధాన సూత్రధారి అఖ్తరుజ్జమాన్‌కు ప్రియురాలు శిలాస్తీ రెహమాన్‌గా గుర్తించారు. ఎంపీ అన్వరుల్ హత్యకు ఆమెను ‘హనీట్రాప్’గా వినియోగించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తొలుత ఆమెతో ఫోన్ ద్వారా మాట్లాడించి.. ఆ తర్వాత ప్లాట్‌కు ఎంపీని పిలిపించినట్లు తెలుస్తోంది. అనంతరం ముందుగా వేసిన పథకం ప్రకారం నిందితులు ఎంపీ అన్వరుల్‌పై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎంపీ హత్యకేసు విచారణలో బంగ్లాదేశ్‌తో పాటు రాష్ట్ర పోలీసుల సీఐడీ కూడా రంగంలోకి దిగింది. రెండు వైపులా దర్యాప్తు అధికారులు మిస్టరీపై విచారణ ముమ్మరం చేశారు. అధికారిక వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. ఎంపీ హత్య తర్వాత శరీర భాగాలను ఎక్కడ పడవేశారో శిలాస్తీ రెహమాన్‌కు తెలుసని సీఐడీ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. న్యూటౌన్ ఫ్లాట్‌లో హత్యకు గురైన బంగ్లా ఎంపీ కేసులో జిహాద్ హౌలాదర్ అనే ప్రొఫెషనల్ కిల్లర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ వ్యక్తి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ముంబైలో ఉంటున్నాడు.
పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన సూత్రదారి అక్తరుజ్జమాన్‌ను రెండు నెలల క్రితమే జిదాన్ ముంబై నుంచి కోల్‌కతాకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అరెస్టయిన జిహాద్ హవ్లాదార్ పోలీసుల విచారణలో ఆ విషయాన్ని అంగీకరించాడు. జిహాద్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అక్తరుజ్జమాన్ ఆదేశాల మేరకు అతను, మరో నలుగురు బంగ్లాదేశీయులతో కలిసి న్యూటౌన్ ఫ్లాట్‌లో ఎంపీని హత్య చేసినట్లు తెలిపాడు. ఈ కేసులో అఖ్తరుజ్జమాన్‌కు ప్రియురాలు శిలాస్తీ రెహమాన్ నోరు విప్పితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.