AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇదెక్కడి విడ్డూరం సామీ..! కారు డ్రైవర్‌ హెల్మెట్ పెట్టుకోలేదని రూ. 1000 జరిమానా..?

కారు నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధించటం గురించి మీరేప్పుడైనా విన్నారా..? బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉండగా.. ఓ కారు నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అది కూడా మామూలు కారు కాదు, ఆడి కారు. ఆడి కారు నడుపుతూ హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు

Viral News: ఇదెక్కడి విడ్డూరం సామీ..! కారు డ్రైవర్‌ హెల్మెట్ పెట్టుకోలేదని రూ. 1000 జరిమానా..?
Wearing Helmet
Jyothi Gadda
|

Updated on: May 24, 2024 | 12:45 PM

Share

చాలా మంది డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించకపోతే జరిమానా అని మనందరికీ తెలిసిందే. కానీ కారు నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధించటం గురించి మీరేప్పుడైనా విన్నారా..? బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉండగా.. ఓ కారు నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అది కూడా మామూలు కారు కాదు, ఆడి కారు. ఆడి కారు నడుపుతూ హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు తనకు రూ.1000 జరిమానా విధించారని ఓ వ్యక్తి ఆరోపించాడు. ఈ క్రమంలోనే బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉండగా.. ఓ కారు నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన బహదూర్ సింగ్ పారికర్ అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం అతనికి ట్రాఫిక్ పోలీసుల నుంచి మెసేజ్ వచ్చింది. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు రూ.1000 జరిమానా విధించినట్టుగా పేర్కొంది. కానీ అతను ఆ సమయంలో బైక్ నడపలేదు.. తన ఆడి కారులో ప్రయాణిస్తుండగా జరిమానా విధించారు. దీనిపై ఆయన పోలీసులను ఆశ్రయించి క్లారిటీ ఇచ్చినా పోలీసులు జరిమానా సమస్యను పరిష్కరించలేదు. అయితే ఎన్నికల తర్వాత ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

కాగా,ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో పరిహార్ ఇలా చెప్పారు. హెల్మెట్ లేకుండా నా కారును నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు నాకు జరిమానా విధించారు. ఇకపై నేను కారు నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాలి. లేదంటే, వాళ్ళు మళ్ళీ నాకు జరిమానా వేస్తే? ఎలా అనే సందేహం వ్యక్తం చేస్తున్నాడు.

నాలుగు రోజుల్లో ఈ వీడియోకు 14,000 వ్యూస్ వచ్చాయి. వీడియోపై ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, “F1 డ్రైవర్లు కూడా హెల్మెట్ ధరిస్తారని అన్నారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, మీ వాహనంపై తప్పుడు చలాన్ జారీ చేయబడితే, మీరు సంబంధిత పోలీస్‌ స్టేషనల్‌లో ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. మరోక వినియోగదారు స్పందిస్తూ..బ్రో యూపిలో ఏదైనా సాధ్యమే.. జాగ్రత్తగా ఉండాలిన చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..