AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banakacherla Project: కృష్ణా బోర్డు అక్కడ.. గోదావరి బోర్డు ఇక్కడ.. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో సంచలన నిర్ణయాలు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఢిల్లీ వేదికగా జరిగిన కీలక సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్‌, నిమ్మల రామానాయుడు, ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు హాజరయ్యారు.

Banakacherla Project: కృష్ణా బోర్డు అక్కడ.. గోదావరి బోర్డు ఇక్కడ.. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో సంచలన నిర్ణయాలు..
Revanth Reddy Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Jul 16, 2025 | 5:31 PM

Share

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఢిల్లీ వేదికగా జరిగిన కీలక సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్‌, నిమ్మల రామానాయుడు, ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు సంబంధించి ఢిల్లీ జరిగిన ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదించింది. 13 అంశాలను ఎజెండాలో ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వం .. పాలమూరు- రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవెళ్ల సహా.. కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనల్లో పేర్కొంది. దాదాపు గంటన్నరపాటు ఈ సమావేశం జరిగింది.

కమిటీ వేయాలని నిర్ణయించాం..

గోదావరి, కృష్ణా నదీ జలాలపై మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని.. ఇచ్చిపుచ్చుకునేవిధంగా ఆహ్లాదకరంగా చర్చలు జరిగాయని నిమ్మల రామానాయుడు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామని కేంద్రం తెలిపిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా నది బోర్డు అమరావతిలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని.. గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సోమవారం(జులై 21) లోగా కమిటీ వేస్తారని.. పోలవరం- బనకచర్లపై టెక్నికల్‌, అడ్మినిస్ట్రేషన్‌ సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించామన్నారు. రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నాం.. రెండు రాష్ట్రాలు అయినా ప్రజలు ఒక్కటే అందరికీ న్యాయం జరగాలని నిమ్మల పేర్కొన్నారు.

ఇక.. ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య కొన్నాళ్లుగా వాటర్‌ వార్‌ జరుగుతోంది. ప్రధానంగా.. గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్ట్‌ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. బనకచర్ల అజెండాగా తెలుగు రాష్ట్రాల రాజకీయం భగ్గుమంటోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం మరింత హీట్‌ పెంచింది. ఇక.. రెండు రాష్ట్రాల మధ్య వివాదాల నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని.. ఢిల్లీ వేదికగా ఇద్దరు సీఎంలతో కీలక సమావేశం నిర్వహించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..